calender_icon.png 23 May, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శం

23-05-2025 01:11:15 AM

  1. సన్న బియ్యం పథకం అభినందనీయం
  2. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి
  3. కాంగ్రెస్‌లో గౌరవం దక్కడం లేదు
  4. ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్  జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 

రాజేంద్రనగర్, మే 22: తెలంగాణ మో డల్ దేశానికి ఆదర్శమని డిసిసి అధ్యక్షుడు, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మే రకు అన్నింటినీ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం గురువారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని దుర్గా కన్వెన్షన్ లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హా జరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. గత పదేళ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని పూర్తిగా దో చుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దివా లా తీయించారని ఆరోపించారు.

కాంగ్రెస్ కార్యకర్తలు ఒక కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయదుందుభి మోగించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం మూడుగా విభజించబడుతుందని, అందరికీ అవకాశాలు వస్తాయని తెలిపారు. 

అందరినీ కలుపుకొని పోతాను

 అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కార్యకర్తలే తన బలంమని, పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవడంమే లక్ష్యమని తెలిపారు.  చిన్న చిన్న సమస్యలు తలెత్తడం సహజమని, వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

పార్టీలో కొత్త పాత నాయకులు అనే భేదం చూపించకుండా ముందుకు సాగాలన్నారు. నా వద్దకు వచ్చే ప్రతి నాయకునికి పని చేసి పెడతానన్నారు. అందరం కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేద్దామన్నారు. 

పార్టీలో గౌరవం దక్కడం లేదు 

 కాంగ్రెస్ పార్టీలో గౌరవం దకడం లేదని రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. చెక్కుల పంపిణీ, కుట్టుమిషన్ల పంపిణీ తదితర కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. ఇది ఏమాత్రం సరి కాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని సూచించారు. 

అనంతరం పార్టీ జిల్లా ఇన్చార్జి ధారా సింగ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆ ధ్వర్యంలో అందరం కలిసిమెలిసి పనిచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్ నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.