calender_icon.png 25 December, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతిభద్రతల పరిరక్షణలో అవిశ్రాంత కృషి

25-12-2025 12:00:00 AM

  1. సత్ఫలితాలిచ్చిన ప్రజాభరోసా 

జిల్లా వ్యాప్తంగా 12 శాతం తగ్గిన నేరాలు 

2025లో 42.85 శాతం తగ్గిన తీవ్రమైన నేరాలు 

32 శాతం తగ్గిన దొంగతనాలు 

గత ఏడాది కంటే 14శాతం తగ్గిన మహిళలపై దాడులు 

సూర్యాపేట, డిసెంబర్ 24 (విజయక్రాంతి) : జిల్లాలో పోలీసులు 2025 లో స్నేహ పూర్వక పోలీసు విధానాన్ని అవలంబిస్తూ బాధ్యతాయుతంగా , పారదర్శకంగా పనిచేస్తూ శాంతి భద్రతలను కాపాడడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని జిల్లా ఎస్పీ కె నర్సింహ స్పష్టం చేశారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వార్షిక నివేదికను ఆవిష్కరించి వివరాలను వెల్లడించా రు.

జిల్లా పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఏప్రిల్ 2, 2025 లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పోలీస్ ప్రజాభరోసా కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. వరకట్న వేధింపుల మరణాలు మాత్రమే 30 శాతం వరకు పెరగగా హత్యలు, దోపిడీలు, దొంగతనాలు,  అత్యాచారాలు, వైట్ కాలర్ నేరాలు   మొదలైనవి గణనీయంగా తగ్గినట్లు తెలిపారు.

ఈ ఏడాది తీవ్రమైన నేరాలు 42.85 శాతం, దొంగతనాలు 32 శాతం, రోడ్డు ప్రమాదాలు 9 శాతం, రోడ్డు ప్రమాద మరణాలు 26.6 శాతం, మహిళల సంబంధిత నేరాలు 14శాతం తగ్గాయన్నారు.జిల్లా వ్యాప్తంగా 2025 లో 6,064 కేసులు నమోదు అయ్యాయన్నారు. అదేవిధంగా నూతనకల్ మండలం లింగంపల్లి లో జరిగిన హత్య మినహా ప్రశాంత వాతావ రణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లో పోలీస్ వ్యూహం ఫలించిందన్నారు.

1500 మంది పోలీస్ ల తో పటిష్ట భద్రత ఏర్పాటు చేసి 1.20లక్షల రూపాయల తో పాటు 144 కేసుల్లో 10.53లక్షల విలువైన 1740 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సందర్భంగా 79 లైసెన్స్ కలిగిన తుపాకులను స్వాధీనం చేసుకొని 429 కేసుల్లో 1488 మంది ని ముందస్తుగా బైండోవర్ చేశామన్నారు. సైబర్ క్రైమ్ కింద 207 కేసులు  10,15,69,977 ఆస్తి నష్టం జరగగా 1,07,50,200 రికవరీ చేశారు.

గంజాయి రవాణా లో 36 కేసులు నమోదు చేసి 99 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపామన్నారు. 616.5 క్వింటాల ల పి డీ ఎస్ బియ్యం పట్టుకుని 94 మందిని అరెస్ట్ చేశామన్నారు. 563 రోడ్డు ప్రమాదాల కేసులు నమోదు కాగా 204 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు 607 మంది గాయాల పాలైనారన్నారు. జిల్లాలో 266697 ఎం. వి యాక్ట్ కేసులు నమోదు కాగా 7,08,77, 065లు ఈ_ చలానా ద్వారా జరిమానా విధించామన్నారు.

అలాగే 12440 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా 69,24,058 లు జరిమానా విధించడం తో పాటు 90మందికి జైలు శిక్షలు పడేలా చేశామన్నారు. దొంగలించ బడిన 57 వివిధ రకాల వాహనాలను రికవరీ చేసి యజమానులకు అందజేసినారు. తప్పి పోయిన 18 మంది చిన్నారులను కనిపెట్టి తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అదేవిధంగా 100 మంది స్త్రీలు తప్పి పోగా 82 మందిని, 249 మంది పురుషులు తప్పి పోగా 222 మందిని కనిపెట్టి వారి వారి కుటుంబసభ్యులకు అప్పగించామన్నారు. ఈ ఏడాది వివిధ కేసులలో 9 మందికి జీవిత ఖైదు, ముగ్గురికి 15 సంవత్సరాలు, ఇరువురికి 5సంవత్సరాలు, ముగ్గురికి 3 సంవత్సరాలు, 13 మందికి ఒక సంవత్సరం లోపు శిక్షలు పడేలా జిల్లా పోలీస్ శాఖ కృషి చేసిందన్నారు.

అదేవిధంగా 8572 పెట్టీ కేసులు, లోక్ అదాలత్ లో 2439 కేసులు రాజి కుదిర్చామన్నారు.ఈ ఏడాది 367 మిస్సింగ్ కేసులు నమోదవుగా 322 కేసులను ఛేదించడం జరిగిందన్నారు,  ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్త్మ్రల్ ద్వారా ఈ సంవత్సరం 197 మంది బాలురులను 143 మంది బాలికలను గుర్తించి సంరక్షణ కేంద్రాలకు మరియు వారి తల్లిదండ్రులకు అప్పగించాలన్నారు.

అలాగే మహిళల రక్షణ కోసం విశేషమైన కృషి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి ,జనార్దన్ రెడ్డి డిఎస్పీలు ప్రసన్నకుమార్ ,శ్రీనివాస్ రెడ్డి, సిఐలు వెంకటయ్య నాగేశ్వరరావు, రాజశేఖర్, చరమంద రాజు, శివశంకర్, బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ డిసిఆర్బి ఇన్స్పెక్టర్ హరిబాబు ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు