25-12-2025 12:00:00 AM
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్
తుంగతుర్తి, డిసెంబర్ 24 (విజయక్రాంతి) : ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగని,తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ స్పష్టం చేశారు. బుధవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో క్రిస్మస్ ను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పాస్టర్లకు, సువార్తికులకు, తుంగతుర్తి నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో జరిగిన ప్రేమ విందు కార్యక్రమానికి ముఖ్య ముఖ్యఅతిథిగా హాజరై పాస్టర్ల తో కలిసి కేక్ ని కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ఏసుప్రభు బోధనల స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. మానవులు ఎప్పుడూ ప్రేమను, కరుణను, క్షమను కలిగి ఉండాలని ఏసు క్రీస్తు చేసిన బోధనలు మానవాళికి అనుసరణీయమని అన్నారు. ప్రతిఒక్కరూ క్షమా గుణంతో సర్వ ప్రాణులను ప్రేమిస్తే యావత్ ప్రపంచం సంతో షంగా ఉంటుందన్నారు.
ఏసుక్రీస్తు ఈ లోకంలోని ప్రజలందరికీ ప్రేమ, అప్యాయతను నేర్పించారని, ఎదుటివారిని ప్రేమించే గుణం మనలో ఉండాలని, ప్రతి ఒక్కరూ పరమత సహనం పాటించాలని పేర్కొన్నారు.ప్రతి పేదవాడు పండుగ రోజు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుస్తులను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, తుంగతుర్తి గ్రామ సర్పంచ్ మల్లెపాక సాయిబాబు, తుంగతుర్తి తహసిల్దార్ దయానందం, ఎంపీడీవో శేషు కుమార్,డిపిఓ యాదగిరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న,సుంకరి జనార్ధన్,నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, గ్రామ పాలన అధికారులు మౌలానా,
సంజీవ, లింగయ్య,కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి మండల కమిటీ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ దాసరి శ్రీను మాచర్ల అనిల్, రాంబాబు యాదవ్,పాస్టర్స్ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు వి. పి డానియల్, అధ్యక్షులు బాకీ పరంజ్యోతి, కేలోతు చంద్రశేఖర్, శ్రీ మోలు, కోట యాకూబ్, సుధీర్, పాస్టర్లు, కాంగ్రెస్ పార్టీ నూతన సర్పంచులు,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.