calender_icon.png 7 August, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లకు మతం రంగు

07-08-2025 12:55:23 AM

సంపతి రమేష్ మహారాజ్ :

భారతదేశం విభిన్న కులాలు, మ తాలు, భాషలు, ప్రాంతాలు, జాతుల సమాహారం. భారత రాజ్యాంగం స మానత్వానికి, సామాజిక న్యాయానికి, ఏక త్వ భావనకు పునాది వేసింది. ఇటీవల మత రాజకీయ ఆధిపత్యంతో లౌకికవాదం ప్ర మాదంలో పడుతుంది. గతంలో కేంద్రప్రభుత్వం సామ్యవాదం, లౌకికవాదాన్ని తొల గించాలని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. మతం మారితే రిజర్వేషన్ రద్దవుతుం దని కోర్టులూ చెబుతున్నాయి.

సిక్కు లేదా బౌద్ధమతం కాకుండా ఇతర మతాల్లోకి మా రిన దళితులకు షెడ్యూల్డ్ కుల హోదా ఇవ్వా లా? వద్దా? అన్న దానిపై భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ నేతృత్వంలో కమిషన్ వేశారు. ఇది దేశంలో వే ర్పాటువాదానికి కారణమవుతూ కులాల వారీగా మతాన్ని పరీక్షిస్తున్నట్టు కనబడుతుంది. భారతదేశంలో అనేక రంగాల్లో మ తం కన్నా కులమే బలంగా కనిపిస్తోంది. అ దే అన్నింటినీ శాసిస్తుంది.

కానీ రాజకీయం గా మతంతో విద్వేషాన్ని సృష్టిస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం అందరూ స మానం కానీ, అసమానతల కారణంగా కొం దరిపట్ల సానుకూల వివక్ష చూపాలని రా జ్యాంగమే చెబుతుంది. ఈ క్రమంలో కుల, మతాలకు అతీతంగా వెనుకబాటుతనం ఆ ధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించారు. ఇప్పటికీ ఈ రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరకపోగా అవి దారి తప్పు తున్నాయి.

90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు కల్పించిన మొత్తం రిజర్వేషన్లు 50 శాతం కాగా... 10 శాతం కూడా లేని అగ్రకుల పేదలకు వారి జనాభాకు మించి విద్య, ఉద్యోగాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ పేరు తో రిజర్వేషన్స్ కల్పించారు. దీన్ని చూస్తే వి వక్ష స్పష్టంగా అర్థం అవుతోంది. తక్కువ జ నాభా ఉన్న అగ్రవర్ణ పేదలకు కల్పించినట్టు గా ఎక్కువ శాతం జనాభా ఉండి.. సమస్య లు ఎదుర్కొంటున్న వారికి కూడా రిజర్వేష న్లు కల్పించాలని పలువురు కోరుతున్నారు. అయినా ప్రభుత్వాలు చలించడం లేదు. 

మత ప్రాతిపదిక రిజర్వేషన్లు లేవు

ఈ దేశంలో మెజార్టీ వర్గమైన బీసీలు రిజర్వేషన్ల విషయంలో చాలా కాలంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో ఆ వర్గాలు రిజ ర్వేషన్ పెంపు కోసం డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల, సర్వే నిర్వహించి.. బీసీల జనాభా 56 శాతంగా తేల్చింది. దీంతో వారికి 42 శాతం విద్యా, ఉద్యోగ, స్థానిక రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ర్ట అసెంబ్లీలో బిల్లును కూడా ఆమోదించి కేంద్రానికి పంపారు.

ఈ బిల్లు పార్లమెంట్‌లో చట్టం చేసి తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని కాంగ్రెస్ నాయకులు డి మాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయిం చారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు సెప్టెంబ ర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో పంచాయతీరాజ్ చట్టం 2018లో రిజర్వేషన్ విధానాన్ని మార్పు చేస్తూ ఆర్డినె న్స్ జారీ చేశారు.

దీన్ని ఇప్పుడు గవర్నర్ ఆ మోదించాల్సి ఉండగా రాష్ట్ర గవర్నర్ రాష్ర్టపతి పరిశీలనకు పంపారు. ఈ క్రమంలో బీజేపీ రాజకీయ నాయకులు 42 శాతం రి జర్వేషన్లలో ముస్లింలను కలిపారని తొండి వాదనొకటి మొదలుపెట్టారు. ముస్లింలను బీసీ రిజర్వేషన్ నుంచి తొలగిస్తే బిల్లుకు మ ద్దతిస్తామని తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు వ్యా ఖ్యానించడం హాస్యాస్పదం. మరోవైపు గతంలో బీఆర్‌ఎస్ పార్టీ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించింది.

లౌకిక ప్రజాస్వామ్య దేశంలో బీసీ రిజర్వేషన్ విషయాన్ని మత రిజర్వేషన్లుగా చిత్రీకరించడం ఆందోళన కలిగిస్తుంది. అస లు భారతదేశంలో మతంతో సంబంధం లే కుండా వెనుకబాటుతనమే రిజర్వేషన్లకు గీ టురాయిగా రాజ్యాంగం పేర్కొంది. ఇప్పటికే గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ర్టలోనూ ముస్లిం వర్గాలు బీసీల్లోనే ఉంటూ రిజర్వేష న్ ఫలాలు అనుభవిస్తున్నారు.

ఇదంతా చూ స్తే రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లను ఓ టు బ్యాంకు సాధనంగా వాడుకుంటూ బీసీ ల నోట్లో మట్టి కొడుతున్నట్టుగా కనిపిస్తోం ది. పలువురు మేధావులు కూడా ఇదే తరహాలో వాదిస్తుండటం గమనార్హం. కొన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్లకు ఆమోదం తెలుపుతుండగా.. కొన్ని మాత్రం వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. 

ముస్లిం రిజర్వేషన్లపై చర్చ

కర్ణాటక తర్వాత ప్రస్తుతం తెలంగాణలోనూ ముస్లిం రిజర్వేషన్లపై చర్చ జరుగు తోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, ఇక్కడ కూడా ముస్లిం రిజర్వేషన్లను ర ద్దు చేస్తామని హోంమంత్రి అమిత్‌షా తా జాగా ఓ బహిరంగ సభలో ప్రకటించారు. ఆయన మాటలకు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ... తెలంగాణలో ము స్లింలకు కులం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తున్నారు.

కానీ, మతం ఆధారంగా ఈ రిజర్వే షన్లు వర్తింపచేస్తున్నారని చెప్పడం అబద్ధం అని, బీజేపీ ముస్లింలను శత్రువులుగా చిత్రీకరిస్తుందని పేర్కొన్నారు. వాస్తవానికి తెలం గాణలో కొన్ని ముస్లిం కులాలు బీసీ- (బీ) కిం ద రిజర్వేషన్ అనుభవిస్తున్నాయి. మరికొన్ని ముస్లిం కులాలు ప్రత్యేకంగా బీసీ (-ఈ) కిం ద, ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ పొందుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007 లో రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో 14 ముస్లిం కులాలను బీసీ-(ఈ) కింద చేర్చి 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. దాన్ని అప్పటి హైకోర్టు కొ ట్టేసింది. అనంతరం ప్రభుత్వం సుప్రీం కోర్టు కి వెళ్లగా.. తుది తీర్పు వచ్చేంతవరకు ఆ రిజర్వేషన్లు కొనసాగించండని తెలిపింది. అంటే ముస్లిం రిజర్వేషన్లపై అంతిమ తీర్పు రావా ల్సి ఉందని అర్థం. అప్పుడే మతపరమైన రి జర్వేషన్లు ఉంటాయా? లేదా అనే విషయం లో స్పష్టత వస్తుంది.

అప్పటివరకు వారు బీ సీ లేనని అర్థమవుతుంది. చారిత్రకంగా కాకకాలేల్కర్ కమిషన్, బీపీ మండల్ కమిషన్ లో పేర్కొన్న బీసీ కులాల్లో ముస్లింలున్నా రు. మండల్ కమిషన్ ప్రకారం 52 శాతం బీసీలలో 8.4 శాతం ముస్లింలున్నారు. వారి కి బీసీలకు వర్తించే రిజర్వేషన్లే వర్తిస్తున్నాయి. కానీ కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఈ రిజర్వేషన్లపై రగడ సృష్టిస్తున్నాయి. కోర్టుల లో కేసులు అంత తొందరగా తేలకపోవడం తో ఈ విషయంపై కొందరు అనవసర రా ద్దాంతం చేస్తున్నారు. 

జనాభా వాటా ప్రకారం రిజర్వేషన్లు

మండల్ కమిషన్ సిఫారసుల మేరకు ఆ నాటి జనతా ప్రభుత్వం సామాజికంగా, వి ద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు 27 శా తం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. వీటిని ఇందిరా సహాని సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతోవిద్య, ఉద్యోగ, రాజకీయాలలో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతు లకు కల్పిస్తోన్న రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని తీర్పు చెప్పింది. రాజ్యాంగం లో ఎక్కడ కూడా రిజర్వేషన్లపై పరిమితి లే దు.

ఇటీవల  న్యా యవ్యవస్థ గొప్పనా, పార్లమెంట్ గొప్పనా అనే వాదన జరుగుతున్న క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయ్ రాజ్యాంగమే సు ప్రీం అని పేర్కొన్నారు. అలాంటప్పుడు స మానత్వానికి పెద్దపీట వేసే రాజ్యాంగ రిజర్వేషన్ విషయంలో కోర్టులు కల్పించుకోవ డం సరికాదు. కావున రాష్ట్రాలు రిజర్వేషన్లు కల్పించుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టుల వైఖరి కూడా మారాలి. ప్ర స్తుతం జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ లేదా రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవ సరం ఉంది.

మత రిజర్వేషన్ల పట్ల కోర్టులు కూడా స్పష్టతనివ్వాలి. రాష్ట్రాలు తమ జనా భా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచుకునే వి ధంగా కేంద్రం ఒక చట్టం తీసుకురావాలి. రా జ్యాంగం మత, భాషాపరమైన మైనారిటీల ను గుర్తించింది. ఈ క్రమంలో  వెనుకబడిన వర్గాలకు లబ్ధి చేకూర్చే రిజర్వేషన్లను హిం దూ, ముస్లిం సమస్యగా మార్చవద్దు. ఇది దేశ ఐక్యతకు చేటు. మరోవైపు ఈ కారణాల వల్ల అసలైన వెనుకబడిన వర్గాలకు నష్టం జరుగుతుంది.

కావున పౌరుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేయాలి. రా జ్యాంగం కూడా అదే కోరుకుంటుంది. కానీ ప్రస్తుత రోజుల్లో కొన్ని రాజకీయ పార్టీలు ఓ టు బ్యాంకు కోసం హిందూ, ముస్లిం అం టూ ప్రజలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుతున్నాయి. అనవసరంగా లేనిపోని వైష మ్యాలు సృష్టిస్తున్నారు. ఏ మతంలో ఉన్నా కానీ వెనుకబడిన వారు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని మరిచి మతం పేరిట అభివృద్ధి ఫలాలు కొందరికి అందకుండా కుట్రలు చేస్తున్నారు. ఈ పరిస్థితులు మారాలి. 

రచయిత సెల్: 7989579428