26-08-2025 03:13:48 AM
హైదరాబాద్, ఆగస్టు 25: విద్యుత్ స్తంభాలపై అనుమతిలేని ఇంటర్నెట్, కేబుల్ వైర్ల తొలగింపుపై సోమవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇటీవల రామంతాపూర్ విద్యుత్ ప్రమాద ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే, విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుళ్ల కారణంగానే ప్రమా దం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ సర్కిల్ వ్యాప్తంగా స్తంభాలపై ఉన్న కేబుళ్లను సిబ్బంది తొలగిస్తున్నారు.
దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ హైకోర్టులో పిటిషన్ వేసింది. అనుమతులు తీసుకొని వేసిన కేబుళ్లను తొలగిస్తు న్నారని సంస్థ తరఫు న్యాయవాది వివరించారు. ఏయే స్తంభాలకు అనుమతి తీసుకున్నారో చూపాలని టీజీఎస్పీడీసీఎల్ తరఫు న్యాయవాది కోరారు. వాదనలు విన్న హైకోర్టు అనుమతిలేని కేబుళ్లను తొలగించొచ్చని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.