26-08-2025 03:12:04 AM
బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు
ఎల్బీనగర్, ఆగస్టు 25 : మహనీయుల స్ఫూర్తితో 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం రాజీలేని పోరాటం చేయాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ , రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవులు పిలుపునిచ్చారు. సోమవా రం మన్సూరాబాద్ లోని స్వకులశాలి భవన్ లో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం రంగారెడ్డి జిల్లా సదస్సు, బీసీ మహనీయుల సంస్మరణ సభలో చిరంజీవులు ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. గతంలో మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే, బీపీ మండల్, శివశంకర్ తదితర మహానీయులు చేసిన పోరాటాలతో బీసీలకు కొంత రిజర్వేషన్లు అమలవుతున్నాయని గుర్తు చేశారు.
375 ఏళ్ల క్రితమే రాజ్యస్థాపన, పరిపాలన చేసిన సర్దార్ పాపన్న ఆలోచన గొప్పదని కొనియాడారు. వీపీ సింగ్ మండల్ కమిషన్ అమలు చేయడంతోనే బీసీలకు రిజర్వేషన్లు దక్కాయన్నారు. ఈ సందర్భంగా చిరంజీవులును కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ నాయకులు సన్మానించారు. ఈ సభకు సంచార జాతుల సంఘం అధ్యక్షులు ఇంటలెక్చువల్స్ ఫోరం కోర్ కమిటీ సభ్యుడు ఒంటెద్దు నరేందర్ అధ్యక్షత వహించారు.
కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫోరం అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆలేటి శ్రీనివాస్ గౌడ్, కమిటీ సభ్యులు చామకూర రాజు, కేవీ గౌడ్, కర్నాటి మనోహర్ నేత, నక్క మహేష్ యాదవ్ ,చెన్నా శ్రీకాంత్, బొల్లం ఆంజనేయులు, కర్నాటి మనోహర్ నేత, మవిండ్ల లింగేష్ యాదవ్, నక్క శ్రీనివాస్ యాదవ్, కడారి రమేష్ యాదవ్, పాలకూరి అశోక్ గౌడ్, దాసోజు లలిత అవ్వరు వేణు పాల్గొన్నారు.