30-04-2025 08:07:14 PM
హైదరాబాద్: 35 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కమిషనరేట్(Hyderabad Commissionerate)లో ఠాణాల పునర్‌వ్యవస్థీకరణ జరిగిందిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) అన్నారు. హైదరాబాద్ లో 71 లా అండ్ ఆర్డర్, 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు(Traffic police stations) ఉన్నాయని సీపీ ఆనంద్ పేర్కొన్నారు. రెండేళ్లుగా పోలీస్ స్టేషన్ల హద్దుల్లో సమస్యలు ఎదురవుతున్నాయని సీపీ సూచించారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ ఠాణాపై గందరగోళం నెలకుందని చెప్పారు. ప్రభుత్వానికి నివేదిక పంపితే ఆమోదం తెలిపిందని వెల్లడించారు. 72 వ లా అండ్ ఆర్డర్ పీఎస్ గా టోలిచౌకి ఏర్పాటు చేశామని సీపీ ఆనంద్ పేర్కొన్నారు. ప్రఖ్యాత ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని ఠాణాలు, డివిజన్ల పేర్లు మార్చామని వివరించారు. పోలీస్ స్టేషన్ల వివరాలు హైదరాబాద్ సిటీ పోలీస్ వెబ్ సైట్ లో ఉంచుతామని సూచించారు. అటు హైదరాబాద్ కమిషనరేట్ లో భారీ ప్రక్షాళన జరిగింది. కమిషనరేట్ పరిధిలో భారీగా సీఐల బదిలీలు జరిగాయి. 146 మంది సీఐలను బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.