calender_icon.png 11 September, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారి మరమ్మతులు చెయ్యండి

11-09-2025 12:29:22 AM

- ప్రజల తీవ్ర ఇబ్బంది పడుతున్న పట్టించుకోని ప్రభుత్వం

- టిఆర్‌ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు 

- సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు ముసలి సతీష్ 

చర్ల, సెప్టెంబర్ 10, (విజయక్రాంతి): ములుగు జిల్లా వాజేడు నుండి భద్రాచలం వరకు ప్రధాన రహదారులను తక్షణమే మ రమ్మత్తులు చేయాలని, కష్టాల్లో ఉన్న రైతులకు సరిపడ యూరియా అందించాలని బి ఆర్‌ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు ముసలి సతీష్ చర్ల గాంధీ బొ మ్మ సెంటర్ నుండి గుంపేనగూడెం వరకు ప్రధాన రహదారిలో బైకు ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించి తదనంతరం తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందచేసిన నాయకు లు బిఆర్‌ఎస్ పార్టీ చర్ల మండలవివి కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో జరిగిన.

ఈ కా ర్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ పాల్గొని మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా వెంకటాపురం నుం డి భద్రాచలం వరకు దాదాపు 50 కి పైగా ఇసుక ర్యాంపులు నడుస్తున్న కారణంగా వేల ఓవర్‌లోడ్ లారీలు వెంకటాపురం నుండి భ ద్రాచలం వరకు తిరుగుతున్న కారణంగా వెంకటాపురం మండలం యాకన్న గూడెం బ్రిడ్జి కుంగిపోయి గత మూడు నెలలుగా రా కపోకలు బంద్ అయి వాహనదారులు ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారు లు పట్టించుకోకపోవడం చూస్తుంటే ప్రజల బాధలు ప్రభుత్వానికి పట్టనట్టే వుంది అని అర్థం అవుతుంది అదేవిధంగా తక్షణమే నష్టపోతున్న రైతులకు 50 వేల టన్నుల మెట్రిక్ యూరియాని అందించాలని ,దెబ్బతిన్న ర హదారులను బాగు చేయాలని ,కుంగిపోయి న వంతెనల వద్ద హై లెవెల్ వంతెనలు ని ర్మించాలి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎస్ డి అజీజ్, ఎస్ కె సాదిక్ డివిజన్ యూత్ నాయకుడు అనిల్ పోలూరి సుజాత బుద్ధ రాజు తెల్లం లక్ష్మినారాయణ సూర్యనారాయణ రాజు బుల్లేబ్బా యి యూత్ అధ్యక్షుడు సతీష్ బిసి సెల్ అ ధ్యక్షుడు వెంకటేశ్వర్రావు ఎస్ సి సెల్ అధ్యక్షుడు రాము ,కుక్కడపు సాయి సంతపూరి స తీష్ చందు మామిడి రాజు మైపా ఎడ్లరామదాసు కొమరయ్య అలవాల కృష్ణ, సుధాకర్ కొంగూరి సోమరాజు సాంబ, అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు.