calender_icon.png 11 September, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.190 కోట్లతో బాసర అభివృద్ధి

11-09-2025 12:27:49 AM

  1. బాసర మాస్టర్ ప్లాన్ పనులకు శ్రీకారం
  2. నష్టపోయిన రైతుకు ఎకరానికి రూ.పదివేల పరిహారం
  3. బాసర త్రిపుల్‌ఐటీ విద్యార్థులతో మంత్రి జూపల్లి భేటీ

నిర్మల్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి నిలయమైన శ్రీశ్రీశ్రీ జ్ఞాన సరస్వతి బాసర ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రభుత్వం రూ 190 కోట్లను ఖర్చు చేయనున్నట్టు పరాష్ట్ర ఎక్సైజ్ ప్రొబిషన్ సాంస్కృతిక పురావస్తు శాఖ మాత్యులు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బుధవారం నిర్మల్ జిల్లా బాసర సోన్ మండలాల్లో ఆయన పర్యటించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి వరద ఏర్పడి ముంపు గురైన కాలనీలను పంటలను పరిశీలించారు. అంతకు ముందు బాసర సరస్వతి దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయ పూజారులు అమ్మవారిని దర్శింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ బాసర ఆలయ అభివృద్ధి ప్రణాళికల కోసం ప్రభుత్వం రూ. 190 మంజూరు చేస్తుందని త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బాసర ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలిపారు.

రాబోయే గోదావరి పుష్కరాలకు ప్రభుత్వపరంగా ఇప్పటినుంచి అన్ని ఏర్పా ట్లు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. వరద ప్రాంతాల్లో సందర్శించిన మంత్రి ఇండ్లు మునిగిపోయిన బాధితులతో మాట్లాడి భవిష్యత్తులో ఇటువంటి వరదరాకుండా ప్రభు త్వం ఏం చేయాలో ప్రణాళికతో ముందుకు పోతుందన్నారు.

గోదావరి వరదల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి గోదావరి చరిత్రలో ఇటువంటి వరద ఎప్పు డు రాలేదని రైతులకు నష్టం చాలా కలిగించిందని వారిని అన్ని విధాల ఆదుకుంటా మని భరోసా కల్పించారు

త్రిపుల్ ఐటీకి కోటి రూపాయలు

గ్రామీణ నిరుపేద విద్యార్థులకు సాంకేతిక విద్య అందిపుచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాసర్ త్రిపుల్ ఐటీ అభివృద్ధికి విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెం చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి ప్రకటించారు.

సమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరగా పరిష్కరిస్తారని తక్షణం బాసర త్రిపుల్ ఐటీ సాంస్కృ త వేదికకు 1.7 కోట్ల నిధులను సమకూర్చనున్నట్టు మంత్రి ప్రకటించారు. ఐటీ ఆలయ ప్రాంగణాలను పరిశీలించి, వంటశాలలు ఆస్పత్రి ఇతర ప్రదేశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు

రూ.పదివేల పరిహారం చెల్లిస్తాం

రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు నేపథ్యంలో వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపా రు. సోను మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ పాఠశాలను ప్రారంభించి శ్రీరామ్ సాగర్ దిగువన గోదావరి వరదతో ముంపు గురైన పంటలను పరిశీలించారు.

జిల్లాలో పదివేల ఎకరాల వరకు నష్టం జరిగిందని అధికారులు సర్వే చేసి నివేదిక ఇచ్చిన వెంటనే ఎకరానికి పదివేల పరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతులు అధైర్య పడవద్దని రెండో పంటకు రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామన్నారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు వివిధ పథకాలకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. బాసరలో 5.75 కోట్లతో నూతనంగా నిర్మిం చి 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి బాసరసోన్ నిర్మల్ టౌన్ పెద్ద ప్రాం తాల్లో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు

కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష

నిర్మల్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పంట నష్టం వరదల పట్ల దెబ్బతిన రోడ్లు కాలువలు చెరువులు పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అన్ని చర్య లు తీసుకుంటుందని మంత్రి జూపల్లి తెలిపా రు. కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు జరిగిన నష్టంపై అధికారు లతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పర్వతప్రాంతంలోని వేలాదికలలో పంట నష్టం జరిగిందని జిల్లా అధికారులు మంత్రికి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ గెడెం నగేష్ ఎమ్మెల్సీ దండే విటల్, మాజీ మంత్రు లు ఇంద్రకరణ్ రెడ్డి, వేణుగోపాల చారి కలెక్టర్ అభిలాష అభినవ్, డిసిసి అధ్యక్షులు శ్రీహరిరావు  మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, అదనపు కలెక్టర్లు, గ్రంథాలయ చైర్మన్, బైసా మార్కెట్ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు

ఆర్థిక స్వవలంబనతోనే అభివృద్ధి

రాష్ట్రంలో మహిళలు నిరుపేదలు ఆర్థిక స్వవలంబన సాధించేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం నిర్మల్ లో మహిళా సంఘాలకు నిరుద్యోగ యువతకులకు ఉపాధి కల్పించేందుకు అం దించే బ్యాంకు రుణాలు వివిధ పథకాలను పంపిణీ చేశారు. మహిళా శక్తి పథకం ద్వారా మహిళల్లో మనోధైర్యం పెంచి వ్యాపార అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు.

ప్రతి జిల్లాలో మహిళా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్ని వర్గాల అభ్యున్నతి తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఖానాపూర్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేడుమ బుజ్జి పటేల్ ఎమ్మెల్సీ దండేవిటల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అడిషనల్ కలెక్టర్లు కిషోర్ కుమార్ ఫైజాన్ అహ్మద్ అజ్మీరా సాంకేత్ కుమార్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.