calender_icon.png 3 February, 2026 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

03-02-2026 02:58:42 PM

బాపన్ బావి తండా సర్పంచ్ బికోజి

తుంగతుర్తి,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను పేద ప్రజల సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని బాపన్ భావి తండా సర్పంచ్ బి.కోజి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బాపన్ బావి తండా గ్రామంలో గిరిజన మహిళకు సుమారు 100 ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో కోళ్లు బర్రెలకు ఉచిత ప్రభుత్వ టీకాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకొని అభివృద్ధి లోకి రావాలని కోరారు. గ్రామ అభివృద్ధిలో అధికారులు ప్రజా ప్రతినిధులు అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొట్టిపర్తి సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, ఉప సర్పంచ్ సాయిరాం, వి ఏ వోలు ఉమా, రజిత, వెటర్నరీ డాక్టర్ రవి ప్రసాద్, నరేష్, రాము, గ్రామ గిరిజన మహిళలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.