calender_icon.png 27 January, 2026 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేడుకగా గణతంత్ర దినోత్సవం

27-01-2026 01:47:11 AM

హైదరాబాద్, జనవరి 26: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరిం చుకుని సోమవారం గోషామహల్ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. గోషామహల్ డివిజన్ బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్ జి ముఖేష్ సింగ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం సమర్పించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గోషామహల్ డివిజన్ అధ్యక్షులు డాక్టర్ పి వెంకటేష్ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదిరులు పాల్గొన్నారు.