27-01-2026 01:45:40 AM
న్యాయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, జనవరి 26: సిటీ సివిల్ కోర్టు న్యాయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర న్యాయ ఉద్యోగుల సంఘం ప్రముఖులు ఎస్‌వీ సుబ్బయ్య ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్య త అని అన్నారు. న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. దేశాభివృద్ధిలో న్యాయ విభాగం పాత్ర ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో బి. రామసుబ్బారెడ్డి, జి.సాయి కుమార్,వజ్రం, ప్రసాద్, ఆర్.ఉద య్, శివశంకర్, రాకేష్ కుమార్, నరేష్ యాదవ్, మనీష్ తదితరులు ఉన్నారు.