27-01-2026 12:49:38 AM
విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ వైవీ దాసేశ్వర రావు
దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే: అడ్వైజర్, రిటైర్డ్ ఐఏఎస్ పూనం మాలకొండయ్య
‘విజ్ఞాన్’లో ఘనంగా గణతంత్ర దినోత్సవం
భూదాన్‌పోచంపల్లి, జనవరి 26: గణతంత్రం అంటే కేవలం హక్కులే కాదని, ప్రతి పౌరుడికి బాధ్యత కూడా ఉంటుందని విజ్ఞా న్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో సోమవారం 77వ గణతంత్ర దినో త్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కార్యక్రమంలో ప్రొఫెసర్ వైవీ దాసే శ్వర రావు మాట్లాడుతూ.. మన దేశంలో వివిధ భాషలు, రాష్ట్రాలు ఉన్నప్పటికీ దేశం విషయంలో మాత్రం అందరం ఒక్కటేనని అన్నారు. నగరం, గ్రామం అనే తేడా లేకుం డా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని సూచించారు.
విజ్ఞా న్ పూర్వ విద్యార్థులు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుతున్నారని గుర్తు చేస్తూ, విద్యార్థులు కూడా అదే బాటలో ముందుకు సాగాలని సూచించారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ అడ్వైజర్ డాక్టర్ పూనం మాలకొండ య్య మాట్లాడుతూ.. 1930లో జరిగిన పూర్ణ స్వరాజ్య ఉద్యమాన్ని గుర్తు చేస్తూ, స్వాతం త్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులందరికీ ఘన నివాళులు అర్పించారు. విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, వారు అంకితభావంతో చదివి దేశ సేవలో ముందుండా లని పిలుపునిచ్చారు. విజ్ఞాన్ కళాతోరణం నుంచి నిర్వహించిన భారీ తిరంగా ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
జాతీయ జెండాలు చేతబట్టి విద్యార్థులు నినాదాలతో ముందుకు సాగగా, అనంతరం జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతాలాపన ఘ నంగా జరిగాయి. విద్యార్థులు నిర్వహించిన గౌరవ వందనం (మార్చ్ పాస్ట్) క్రమశిక్షణకు నిదర్శనంగా నిలిచింది. దేశభక్తి గీతాలు, నృ త్యాలు, నాటిక జాతీయ సమైక్యతను చాటిచెప్పాయి. ఎన్సీసీ విద్యార్థుల డ్రిల్ ఆకట్టు కోగా, వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బాణసంచా వేడుకలు ఉత్సవానికి మరింత శోభను చేకూర్చగా, చివరిగా మిఠాయిల పంపిణీతో వేడుకలు ఆనందోత్సాహాల మ ధ్య ముగిశాయి. ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.