27-01-2026 12:00:00 AM
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జడ్జీలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, నాయకులు
దేశ భక్తి ఉట్టిపడేలా ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
ఆదిలాబాద్/కుమ్రం భీం ఆసిఫాబాద్/నిర్మల్/మంచిర్యాల/బైంసా/ఉట్నూర్/చెన్నూర్/బెల్లంపల్లి/హాజీపూర్, జనవరి 26 (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 77వ గణ తంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వాడవాడలా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడే. పాఠశాలల విద్యార్థుల ప్రభాతభేరితో పలు పురవీధులలో దేశభక్తి నినాదాలు మారుమ్రోగాయి. భారత రాజ్యాంగ విశిష్టతను వివరిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. పలు చోట్ల విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
భారత రాజ్యాంగం సమాన హక్కులు కల్పించింది: మంత్రి వివేక్
భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ కల్పించిందని రాష్ట్ర కార్మిక, గనులు, ఉపాధి శాఖామంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీ య జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, దేశాభివృద్ధికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు, యువత, పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని, చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధు లు, పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో దేశ భక్తి ఉట్టిపడేలా జరిగిన వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపెంచారు.
అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన జీప్‌లో కలెక్టర్, ఎస్పీలు పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును, సాధించిన విజయాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన అం దరినీ విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం వివి ధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గేయాలు, సాంస్కృతిక, నృత్య రూపకాలు సభికులను అలరించాయి.
అదేవిధంగా జిల్లాలో అంకితభావంతో విధులు నిర్వహించి, విశిష్ట సేవలు అందించిన వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు, ఆరోగ్య పాఠశాల స్టూడెంట్ ఛాంపియన్లకు, వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి అతిథులు ప్రశంసా పత్రాలను అందజేసి, అభినందించారు. అనంతరం వివి ధ శాఖల స్టాల్ లను అతిథులు సందర్శించి, పలువురు రైతులకు వ్యవసాయ ఉపకరణాలు అందించారు. ఈ వేడుకలో అదనపు కలెక్టర్లు శ్యామలా దేవి, రాజేశ్వర్, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచాలి: కలెక్టర్ అభిలాష
సోమవారం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, పోలీసు పరేడ్ వాహనంపై పరేడ్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వివిధ శాఖలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరాలను వెల్లడించారు. ఆ తర్వాత కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలల విద్యార్థులచే దేశభక్తి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. పోలీసుల ఉత్తమ సేవలకు గాను పలువురికి మెడల్స్ అందించారు. ఉత్తమ పనితీరుకు ప్రశంసా పత్రాలు కొలమానమని తెలిపారు. రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తూ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచాల న్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్ళను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిళ, అదనపు కలెక్టర్‌లు ఫైజాన్ అహ్మద్, కిషోర్‌కుమార్ లు, భైంసా ఎఎస్పీ రాజేష్ మీనా, అదనపు ఎస్పీ లు సాయికిరణ్, ఉపేంద్రారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న వివిధ ప్రాంతాల్లో జరిగి న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయం లో పార్టీ శ్రేణులతో కలిసి మువ్వన్నెల జెండా ను ఎగరవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని మహాత్మ గాం ధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నూతన డీసీసీ అధ్యక్షులు డా.నరే ష్ జాదవ్ పార్టీ శ్రేణులతో కలిసి గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి, మువ్వన్నెల జెండాను ఎగరవేశారు.
మరోవైపు సీపీఐ పార్టీ కార్యాలయంలో సైతం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ను ఎగురవేసి, గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
దేశ ఎంతో అభివృద్ధి సాధించింది: ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి
గణతంత్ర భారతదేశంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవా రం నిర్మల్ జిల్లా కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, జెండా లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉన్నారు.
నిర్మల్ ఎస్పీ కార్యాలయంలో...
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదరపు ఎస్పీలు ఉపేందర్ రెడ్డి, సాయికుమార్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.
అవార్డు అందుకున్న అధికారులు..
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మిషన్ భగీరథ ఈఈ సందీప్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా జిల్లా ఉత్తమ అధికారిగా అవార్డు స్వీకరించారు. అవార్డు అందుకున్న సందీప్ కుమార్, రాజేందర్‌ను సోమవారం కార్యాలయంలో ఉద్యోగులు ప్రత్యేకంగా సన్మానం చేసి అభినందనలు తెలిపారు.
ప్రజల సంక్షేమం కోసం పథకాలు: కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటుచేసిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికార యంత్రాంగం మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ వ్యాపార రంగాలలో మహిళలను భాగస్వామ్యులను చేస్తున్నామని అన్నారు.
క్యూర్ - ప్యూర్ - రేర్ నినాదంతో 2047 రైజింగ్ తెలంగాణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ దేశంలో ప్రథమ స్థానంలో జిల్లాను నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం వివిధ శాఖలలో ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ వేడు కలలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీసీపీ ఎగ్గడి భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, డీఎఫ్‌ఓ శివ్ ఆశిష్ సింగ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి పట్టణంలో 77 గణతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి రెవెన్యూ సబ్ డివిజన్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మనోజ్, జూనీయర్ సివిల్ కోర్టులో న్యాయమూర్తి జే. ముఖేష్, క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, తహసీల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ లౌడియా కృష్ణ, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏసీపీ ఎ. రవి కుమార్ లు మువ్వన్నెల జెండాలు ఆవిష్కరించారు.
మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ జే సంపత్ రెడ్డి, టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎంపీడీవో కార్యాలయంలో మహేందర్, సింగరేణి ఏరియా ఆసుపత్రిలో డి వై సీఎంవో పాండు రంగాచారి, శాంతిఖని గని వద్ద మేనేజర్ విజయకుమార్ సిన్హా, కాంగ్రెస్, సీపీఐ, బీఆర్‌ఎస్, సీపీఎం, టీడీపీ, బీజేపీ ఆఫీసుల వద్ద గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి రూరల్ కార్యాలయం వద్ద సీఐ హనోక్, వన్ టౌన్ వద్ద సీఐ శ్రీనివాసరావు, టూ టౌన్ వద్ద కిరణ్ కుమార్, తాళ్ళ గిరిజాల పోలీస్టేషన్ వద్ద ఎస్‌ఐ రామకృష్ణ జాతీయ జెండా ఆవిష్కరించారు.
బెటాలియన్‌లో గణతంత్ర వేడుకలు
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు గుడిపేట 13వ బెటాలియన్‌లో ఘనంగా నిర్వహిం చారు. కమాండెంట్ పి వెంకటరాములు జాతీ య జెండాను ఆవిష్కరించారు. భారత మాతృభూమికి నిబద్ధత తెలియజేస్తూ అందరు జాతీ య గీతం పాడారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ నాగేశ్వరరా వు, యూనిట్ మెడికల్ ఆఫీసర్ సంతోష్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌం డ్లో జరిగిన ప్రధాన కార్యక్రమంలో కలెక్టర్ కె. హరిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎస్పీ నితిక పంత్, జాయింట్ కలెక్టర్ డేవిడ్, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, డీఎఫ్‌ఓ నిరజ్ కుమార్తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కోవ లక్ష్మి పలు చోట్ల జాతీయ జెండాను ఆవిష్కరించారు. క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో త్రివర్ణ పతా కాన్ని ఎగురవేసి రాజ్యాంగ నిర్మాతల త్యాగాల ను స్మరించుకున్నారు. అనంతరం తెలంగాణ భవన్లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళు లు అర్పించారు. డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విట్టల్, నియోజకవర్గ ఇంచార్జి అజ్మీరా శ్యాంనాయక్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నితిక పంత్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 44 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజే శారు. బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ యాదవ్తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శం: ఎమ్మెల్యే పాయల్
ప్రపంచంలో అన్ని దేశాలకు రాజ్యాంగాలు ఉన్నప్పటికీ భారత దేశానికి ఉన్న రాజ్యాంగం ఎంతో పటిష్ఠమైన రాజ్యాంగం అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మన రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శం అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆది లాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యం, బీజేపీ జిల్లా కార్యాలయం, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, మున్సిపల్ కార్యాలయం, లారీ ఓనర్ అసోసియేషన్ కార్యాలయాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. కార్యక్రమం లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు లాలా మున్నా, వేద వ్యాస్, జోగు రవి, భీమ్ సేన్ రెడ్డి, జ్యోతి రెడ్డి, సునందరెడ్డి, ధోనే జ్యోతి పాల్గొన్నారు.
చట్టాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ముందు చూపు తో రాసిన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినగం చేసుకోవడంతో పాటు రాజ్యాంగంలోని చట్టాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని భువనగిరి జిల్లా న్యాయమూర్తి స్వాతి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఇంద్రవెల్లి మండల తాసి ల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల వందన సమర్పణ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో జీవన్ రెడ్డి, సర్పంచ్ రాథోడ్ మోహన్ సింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉత్తమ్, డిప్యూటీ తాహాసిల్దార్ రమేష్,అధికారులు పాల్గొన్నారు.
బైంసాలో గణతంత్ర వేడుకలు..
బైంసాలో సోమవారం గణతంత్ర దినోత్సవ ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భం గా ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల, విద్యాసంస్థల్లో జాతీయ పతాకం రెపరెపలాడింది. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, జూనియర్ సివిల్ జడ్జ్ దేవేంద్ర బాబు, సబ్ కలెక్టర్ అజ్మీర్ సంకేత్ కుమార్, ఏ ఎస్ పి రాజేష్ మీనా, ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విట్టల్‌రెడ్డి, వివిధ నాయకులు, అధికారులు తమ కార్యాలయాల్లో జాతీయ పతాకా న్ని ఎగురవేశారు.
ప్రెసిడెంట్ మెడల్‌కు కమాండెంట్ ఎంపిక
భారత ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన 2026 సంవత్సరానికి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌కు తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన హాజీపూర్ మండలం గుడిపేట 13వ బెటాలియన్ కమాండెంట్ పి వెంకట రాములు ఎంపికయ్యారు. పోలీస్ శ్రేణిలో అత్యున్నత గౌరవాలలో ఒకటిగా పరిగణించబడే ప్రెసిడెంట్ మెడల్‌కు కమాండెంట్ వెంకటరాములు ఎంపిక కావడం బెటాలియన్ అధికారులు, సిబ్బం ది సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ వెంకట రాములు మాట్లాడుతూ ఈ విజయం బెటాలియన్ సమగ్ర ప్రదర్శనకు మరింత ఉత్సాహాన్ని నింపిందన్నారు.