27-01-2026 12:52:49 AM
జాతీయ స్థాయి ఇంటెలిజెమ్ పోటీల్లో సంస్కృతి కొండూరు
హైదరాబాద్, జనవరి 26: హైదరాబాద్‌కి చెం దిన 7వ తరగతి విద్యార్థిని సంస్కృతి కొండూరు జాతీయ స్థాయి ఇంటెలిజెమ్ పోటీ 6వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలేలో రన్నరప్‌గా నిలిచింది.‘సార్వత్రిక విలువలు’, ‘ఆర్థిక అక్షరాస్యత’ అనే అంశంపై సీనియర్స్ విభాగంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుం చి సంస్కృతి రన్నరప్ టైటిల్‌ను గెలుచుకున్నట్లు హెచ్‌పీఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
దీంతో సంస్కృతి వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు చేరుకుంది. గత ఆరు ఎడిషన్ల పోటీల లో హెచ్‌పీఎస్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక విద్యార్థిని ఆమె అని, ఈ ఎడిషన్‌లో జూనియర్ విభాగంలో హెచ్‌పీఎస్ నుంచి మరో ఇద్దరు విద్యార్థులు ఫైనల్‌కి చేరుకున్నారని తెలిపింది. సంస్కృతి, ఆమె పాల్గొన్న నా లుగు విభాగాల్లో సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. రెండు విభాగాల్లో, ఆమె దేశవ్యాప్తంగా ఏడో తరగతి నుంచి పోటీలో పాల్గొన్న మొదటి రెండు విద్యార్థులలో ఒకరిగా నిలిచిందని హెచ్‌పీఎస్ తెలిపింది.