calender_icon.png 27 January, 2026 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీవో ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు

27-01-2026 12:50:58 AM

ఖమ్మం, జనవరి 26: 77వ రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో సోమవారం  టీజీవో భవన్‌లో అధ్యక్ష కార్యదర్శులు కొంగర వెంకటేశ్వరరావు, మోదు గు వేలాద్రి అధ్యక్షతన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. భారతదేశానికి ఒక రా జ్యాంగాన్ని రచించి దానిని అమలులోకి తీసుకువచ్చి నేడు సర్వసత్తాక గణతంత్ర రాజ్యాంగ ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారతదేశ అవతరించిందని కొనియాడారు.

వందేమాతరం నినాదం స్వతంత్ర ఉద్యమానికి పునాది అని అన్నారు. వందేమాతర గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వందేమాతర గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో మహిళ కార్యదర్శి పి సుధారాణి, టీజీవో హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి విజయ్ కుమార్,  తెలంగాణ అగ్రి డాక్టర్స్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు బాలాజీ, టీజీవో రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శి ప్రిన్సిపల్ విజయ కుమారి, అరుణ జ్యోతి, శాంతి కుమారి, బి.కృష్ణార్జునరావు, జల్లి పుష్ప రాజు, మోదుగు వెంకటేశ్వర్లు, బి మోహన్, తిరుపతిరావు, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.