calender_icon.png 27 January, 2026 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

27-01-2026 12:51:52 AM

మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి 

సికింద్రాబాద్/ముషీరాబాద్/జూబ్లీహిల్స్/సనత్‌నగర్/కుత్బుల్లాపూర్/ఉప్పల్/కుషాయిగూడ , జనవరి 26: (విజయక్రాంతి): ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, బాధ్యతాయుత పౌరులుగా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం న్యూ బోయిన్‌పల్లి క్యాంపు కార్యాలయం వద్ద జాతీ య జెండాను ఆయన ఎగరవేశారు.

అలాగే ఓల్డ్ బోయిన్ పల్లి 119 డివిజన్‌లో పలు బస్తీలు, కాలనీలలో గణతంత్ర దినోత్సవ వేడుకలులో కార్పొరేటర్ ముద్దం నరసింహయా దవ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కంటోన్మెంట్ ఒక టోవార్డులో పలు ప్రాంతాల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్  జాతీయ జెం డాను ఆవిష్కరించారు. కంటోన్మెంట్ ఆరో వార్డ్‌లో పరిధిలో పలు ప్రాంతాల్లో జాతీయ జెండాను మాజీ బోర్డ్ సభ్యుడు పాండుయాదవ్ ఆవిష్కరించారు.

సికింద్రాబాద్‌లో పలు ప్రాంతాల్లో టీడీపీ నియోజకవర్గం ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తల సాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. న్యూబోయిన్‌పల్లి ఒకటవ వార్డ్ లోపలు ప్రాంతాల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షు డు జక్కుల మహేశ్వర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

బొల్లారం రాష్ట్రపతి  నిలయంలో మేనేజర్ డాక్టర్ కె.రజనీ ప్రియ జాతీ య జెండాను ఆవిష్కరించారు. కంటోన్మెంట్ వికాస్ మంచ్  కార్యాలయంలో  జాతీయ జెండాను రామడుగు దామోదర్, సంకి రవీందర్ ఆవిష్కరించారు. అలాగే దక్షిణ మధ్య రైల్వే ఘనంగా నిర్వహించింది. సోమవారం  సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోరట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో గణతంత్ర వేడుకలకు అతిథిగా విచ్చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ జాతీయ జెండా ను ఆవిష్కరించి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్  వివిధ బృందాలు అందించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఖైదీల పునరావాసమే ప్రధాన లక్ష్యం: జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా

తెలంగాణ జైళ్ల శాఖలో చేపట్టిన సంస్కరణ లు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఖైదీల పునరావాసమే మా ప్రధాన లక్ష్యం అని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా అన్నారు. చంచల్గూడలోని జైళ్ల శాఖ కార్యాలయంలో 76వ గణ తంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.

జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉత్తమ ప్రతి భ కనబర్చిన జైలు అధికారులు, సిబ్బందికి పతకాలు అందజేయడమే కాక, సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వేడుకలో జైళ్ల శాఖ ఐజీలు మురళీ బాబు, రాజేష్, డీఐజీలు డాక్టర్ శ్రీనివాస్, సంపత్, జైలు సూపరింటెండెంట్లు నవాబ్ శివకుమార్ గౌడ్, వెంకటలక్ష్మీ, అమరావతి తదితరులు పాల్గొన్నారు.

యువత భారతదేశాన్ని అగ్ర దేశంగా తీర్చిదిద్దాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య 

పేదరికం, దరిద్రం, నిరుద్యోగం, నిరక్షరాస్యత లేని దేశంగా, ఆకలి- అజ్ఞానం- అస మానతలు, దోపిడీ, పీడన వివక్ష,  అణచివేత లు లేని దేశంగా భారత దేశాన్ని తీర్చిదిద్దాలని,  అందుకు విద్యార్థులు యువకులు కృషి చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు.

ఈ మేరకు సోమవారం  77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కృష్ణయ్య విద్యానగర్,  లాల పేట, నామాలగుండు, నారాయణగూడ, అబిడ్స్, చిక్కడపల్లిలో కుడా జెండా ఎగురవేసి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నీల వెంకటేష్, జి. అనంతయ్య, పగిళ్ళ సతీష్, శివ కుమర్ యాదవ్, మోడీ రాందేవ్, అఖిల్ ముదిరాజ్, జితేందర్ యాదవ్, విశాల, వంశీ, వేణుమాధవ్ యాదవ్, కర్రీ సిద్ధార్థ సాయి, మోహిత్, రోహిత్ పాల్గొన్నారు.

మన రాజ్యాంగం ఒక దిక్సూచి: -ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు మిన్నంటాయి. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పర్యటించి నియోజకవర్గంలో ని పలు చోట్ల జాతీయ జెండాను ఆవిష్కరించారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని వెల్లంకి ఫుడ్స్ సమీపంలో, వెంగళరావు నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాంగణంలో, వెంగళరావు నగర్ చౌరస్తా, వాటర్ ట్యాంక్ పరిసరాలు, కళ్యాణ్ నగర్ చౌరస్తా, ఏజీ కాలనీలోని శ్రీ సాయిబాబా దేవాలయం వద్ద ఆయన మువ్వన్నెల జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన రాజ్యాంగం ఒక దిక్సూచిలా నిలుస్తుందని కొనియాడారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ స్థాయిల ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సంజీవ్‌రెడ్డినగర్ డివిజన్‌లో..

సంజీరెడ్డినగర్‌లోనిని గ్రౌండ్‌లో 77 గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ హించారు. కాంగ్రెస్ పార్టీ గోదాసి అజయ్ ఆధ్వర్యంలో  సంజీవ్‌రెడ్డినగర్  డివిజన్‌లో  జాతీయ జెండాను ఎంపీ ఎం.అనిల్‌కుమార్ యాదవ్  ఆవిష్కరించగా. ఈ కార్యక్రమంలో  సురేష్ వర్మ,ప్రశాంత్ (టింకూ), ఆకుల వేణునాథ్, హనుమంత్ రావు,వెంకట్ పాశం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సుప్రభాత్ హోటల్ చౌరస్తాలో..

సంజీవ్‌రెడ్డినగర్‌లోని సుప్రభాత్ హోటల్ చౌరస్తాలో గణతంత్ర దినోత్సవ సందర్బంగా సికింద్రాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధా న కార్యదర్శి  జి.శ్రీకాంత్ యాదవ్ అధ్వర్యం లో డాక్టర్ కోట నీలిమ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్‌నగర్ ఇంచార్జ్  జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సీనియర్ నాయకులు ఎం.నవీన్ రాజ్, యు.ప్రశాంత్, జి.సాయి గౌడ్.చుక్కా నరేష్ , కిషన్ సింగ్ , ప్రతాప్ నాయక్ కార్యకర్తలు పాల్గొన్నారు.

బీజేపీ చౌక్ నెహ్రూ పార్క్ వద్ద.. 

గణతంత్ర వేడుకలు బీజేపీ చౌక్ నెహ్రూ పార్క్ వద్ద బీజేపీ సనత్ నగర్ డివిజన్ అధ్యక్షులు సిర్మనీ నరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు దయానంద్, మూల రవీందర్, నర్సింగ్ రావు, కన్నూరి క్రాంతికుమార్, కన్నూరి చంద్రకుమార్, హృషికేష్, మామాజీ, ఆకుల మహేష్ కుమార్,సుమన్ కుమార్,రజనీష్ కుమార్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

ముషీరాబాద్‌లో 77వ గణతంత్ర వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని కవాడిగూడ, భోలక్పూ ర్,  గాంధీనగర్, రాంనగర్, అడిక్మెట్,  ముషీరాబాద్ డివిజన్లోని ప్రభుత్వ కార్యాలయాలు,  ప్రభుత్వ పాఠశాలలు, దవాఖానాలు,  కాంగ్రె స్, బీజేపీ, బీఆర్‌ఎస్ తో పాటు పలు పార్టీల కార్యాలయాల వద్ద మువ్వన్నెల జెండాను ఎగరవేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గాంధీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల యం వద్ద ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహల ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాను ఎగరవేశారు.

గాంధీనగర్‌లోని కార్పొరేటర్ కార్యాల యం వద్ద కార్పొరేటర్ ఏ. పావని వినయ్ కుమార్ జెండా ఎగరవేశారు. కవాడిగూడ లోని ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్‌లో స్కూల్ కరస్పాండెంట్, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపల్ పి. స్వర్ణలతా రెడ్డిలు జెండా ఎగరవేశారు. కవాడిగూడలో కార్పొరేటర్ గోడ్చల రచన శ్రీ, జి. వెంకటేష్ ఆధ్వర్యంలో మువ్వన్నెల జెం డాను ఎగరవేశారు. ముషీరాబాద్ లో కార్పొరేటర్ సుప్రియ నవీన్‌గౌడ్, బిజెపి నాయకులు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో జెండాను ఎగరవేశారు.

ఆక్స్‌ఫర్డ్ గ్రామర్‌హైస్కూల్‌లో గణతం త్ర దినోత్సవాన్ని సోమవారం పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వర రావు హాజరై స్కూల్ డైరెక్టర్ ప్రార్థన మణికొండతో కలసి త్రివర్ణ పతా కాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి కరస్పాండెంట్ కట్టా ప్రభాకర్, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

దుండిగల్ సర్కిల్ బీజేపీ ఆధ్వర్యంలో..

దుండిగల్ సర్కిల్ బీజేపీ ఆధ్వర్యంలో 77వ ఘనతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట్ సింహపురి కాలనీ, మల్లం పేట్ బస్టాప్ నందు సర్కిల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోనె మల్లారెడ్డి,సర్కిల్ ఉపాధ్యక్షులు ఎంబరి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి సీతారాంరెడ్డి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు ఆధ్వర్యంలో లిబర్టీలోని ఆప్ రాష్ట్ర కార్యాలయం వద్ద సోమ వా రం జాతీయ జండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఆప్‌నేతలు ఎండి.సోహై, కుత్బుద్దీన్, భాస్కర్, రాకేష్‌రెడ్డి, యూనుస్, రమ్య గౌడ్, బాగ్ బేగం, మౌనిక, ఎల్లేష్, వివేక్, అబ్బాస్, రామకృష్ణ, ఇస్మాయిల్ పాల్గొన్నారు.

ఏఎస్ రావునగర్‌లోని భాష్యం లిటిల్ చాంప్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ వని త, ఉపాధ్యాయులు పిల్లలకు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. 

మల్లాపూర్ డివిజన్లో  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  నెమలి అనిల్ ఆధ్వర్యంలో  జాతీయ జెండాను ఆవిష్కరించగా,  నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి హెచ్‌ఎంటి నగర్, ఇందిరానగర్ ప్రాంతాల్లో  జెండాను ఆవిష్కరించారు.