27-01-2026 01:51:39 AM
టెక్నాలజినీ అందిపుచ్చుకోవాలి
జిల్లా జడ్జి ప్రవీణ్‌కుమార్
ఇబ్రహీంపట్నం, జనవరి 26: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఇబ్రహీం ప ట్నం కోర్టు ఆవరణలో 15వ అదనపు జిల్లా జడ్జి జి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా జిల్లా జడ్జి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముద్దం వెంకటేశం అధ్యక్షతన నిర్వ హించిన సమావేశంలో జిల్లా జడ్డి ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. భారత రాజ్యాంగం అతి పెద్ద రాజ్యాంగమని, సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా విరాజిల్లు తుందన్నారు. రాజ్యాంగం రూపొందించడంలో పాలుపంచుకున్న వారందరిని ఆయ న స్మరించుకున్నారు. న్యాయ వ్యవస్థలో టెక్నాలజీని అందిపుచ్చుకొని పేపర్ లెస్ కేసులను వేయాలని, ఆన్‌లైన్ ద్వారా న్యా యవాదులు, తమ తమ ఛాంబర్ నుంచి వాదనలు వినిపించుకోవాలని సూచించారు.
ఆన్‌లైన్ ద్వారా పారదర్శకత ఏర్పడుతుందని అన్నారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శంకర్ శ్రీదేవి మాట్లాడుతూ కోర్టులో న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, కో ర్టు సిబ్బందికి మౌలిక వసతుల ఏర్పాట్లలో కృషి చేయాలని కోరారు. అదనపు సీనియర్ సివిల్ జడ్జి రిటాల్ లాల్ చందు మాట్లాడుతూ స్పీడ్ డిస్పోసల్ కోసం మనమం దరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. మరో అతిథి మహబూబ్‌నగర్ జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వి. ఈశ్వర్ మా ట్లాడుతూ కోర్టులో వేసిన ప్రతి కేసు న్యాయవాదుల వాదనలు ఎంతో ఓపికతో విని, పరిశీలించి, చదివి తీర్పు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ న్యాయమూర్తులు, న్యాయవాదులు సమిష్టిగా కృషి చేసి లిటిగన్స్‌కు న్యాయం చేయాలన్నారు. అధ్యక్షులు ముద్దం వెంకటేశం మాట్లాడుతూ చట్టబద్ధమైన పరిపాలన(రూల్ ఆఫ్ లా) పరిరక్షించడంలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు..
అనంతరం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన క్రీడల్లో గెలు పొందిన వారికి బహుమతులు అందజేశా రు. ఉప్పరగూడ అగ్రికల్చర్ కో-ఆపరేటి వ్ సొసైటీ వారు కోర్టు హాళ్లు, సెక్షన్స్‌కు గోడ గడియారాలు అందించారు. కార్యక్రమంలో బా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరిగే శ్రీనివాస్ కుమార్, ఉపాధ్యక్షులు వై భాస్కర్, ట్రెజరర్ సాయి కుమార్, స్పోరట్స్ అండ్ కల్చర్ సెక్రటరీ జైపాల్ నాయక్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మల్లేష్ రామకృష్ణ, సీనియర్ న్యాయవాదులు సుగుణాకర్ రెడ్డి, మాదన్న, జీ నర్సిరెడ్డి, అరుణ్ కుమార్, అంజన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, జేపీ మహేందర్, గురువారెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, భిక్షపతి,న్యాయవాదులు రమేష్, అజయ్ రెడ్డి, శ్రీశైలం, జక్కుల జగన్, సాయి కిరణ్ రెడ్డి, మధు బాబు, శ్రీకాంత్, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.