27-01-2026 12:54:44 AM
బొమ్మనేని రవీందర్‌రెడ్డి
చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
వరంగల్, జనవరి 25: నగరంలోని వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యాలయంలో సోమవారం ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సాధన ఉద్యమంలో అ సువులు బాసిన అమరవీరులను స్మరించుకున్నారు. స్వాతంత్య్రాన్ని ప్రజల ప్రయోజనా ల కోసం రాజ్యాంగ నిర్మాతలచే రూపొందించబడి భవిష్యత్తు భారతావనికి దిశానిర్దేశంగా చేసేలా రాజ్యాంగాన్ని రూపొందించుకున్నామన్నారు.
కాగా మన చాంబర్ ఆఫ్ కా మర్స్ అండ్ ఇండస్ట్రీ సంస్థకు కూడా సభ్యులందరం కలిసి ఒక నియమావళిని రూపొం దించుకున్నామన్నారు. సభ్యులందరూ సం స్థ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి పాటుపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ మార్కెట్ వ్యాపారాల్లో చేదోడువాదోడుగా ఉంటూ వ్యాపార అభివృద్ధిలో భాగమై తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న గుమ స్తా సోదరుల సంక్షేమ నిధికి 10 లక్షల రూ పాయల చెక్కును గుమస్తా సంఘం అధ్యక్ష కార్యదర్శులు, వారి కార్యవర్గానికి అందజేశారు.
ఈ సందర్భంగా గుమస్తా సంఘ అధ్యక్ష కార్యదర్శులు బొమ్మినేని రవీందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చాంబర్ మాజీ అధ్యక్షులు తుమికి రమేష్ బాబు, కటకం పెంటయ్య, ఉపాధ్యక్షులు మొ గిలి చంద్రమౌళి ,సంయుక్త కార్యదర్శి సాగర్ల శ్రీనివాస్, కోశాధికారి అల్లే సంపత్, కార్యవర్గ సభ్యులు కైలాస హరినాథ్, సుదాటి రాజేశ్వరరావు, గాజుల సుమన్, కో ఆప్షన్ మెంబర్ రాయిశెట్టి సత్యనారాయణ, సలహాదారు వెల్ది చక్రధర్, ఛాంబర్ అనుబంధ సెక్షన్ల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యు లు, గౌరవ సభ్యులు పాల్గొన్నారు.