01-09-2025 07:58:22 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని 19వ వార్డులో నూతనంగా చేపట్టనున్న రోడ్డు వెడల్పు తగ్గించాలని స్థానిక దుకాణాల వ్యాపారస్తులు, ఇళ్ల యజమానులు సోమవారం బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ కు వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ అధికారులు 60 ఫీట్లు చేపడుతామని చెబుతుండడం తమను ఆందోళనకు గురి చేస్తుందని పేర్కొన్నారు. ఈ రోడ్డు విస్తరణ వల్ల వ్యాపారులు, ఇళ్ల యజమానులు తీవ్రంగా నష్టపోయి రోడ్డు న పడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కాంటా నుండి పోచమ్మ గుడి వరకు 30 నుండి 40 ఫీట్ల లోపు రోడ్డు విస్తరణ చేపడితే కొంతవరకు నష్టపోయిన సహకరిస్తామని వారు పేర్కొన్నారు. 60 ఫీట్లు రోడ్డు విస్తరిస్తే బస్తీ వాసులు ఇళ్ల ను పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు బస్తీ ప్రజలు ఇళ్లతోపాటు జీవనోపాధిని కోల్పోకుండా రోడ్డు విస్తరణ చేపట్టాలని వినతిపత్రంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ ను కోరారు.