01-09-2025 07:59:08 PM
వడ్డేపల్లి (విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Pingle Government Degree College) అటానమస్ లో సోమవారం హెల్త్ క్లబ్ డిపార్ట మెంట్ ఆఫ్ జువాలజీ, సదాశయ ఆర్గాన్ డొనేషన్ వెల్పేర్ ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో నేత్ర దాన అవగాహన సదస్సును నిర్వహించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి మాట్లాడుతూ, చూపులేని వారికి వెలుగునిచ్చే దానం నేత్రదానం అని ఒకవ్యకి తన రెండు కళ్ళుదానం చేస్తే కనీసం ఇద్దరు వ్యక్తులకు వెలుగు నిచ్చి వారి జీవితాలను మార్చగలరు అని అన్నారు. నేత్ర దానం, అవయవ దానం యెక్క ఆవశ్యకతను విద్యార్థులకు ఫౌండేషన్ సభ్యులు శ్రావణ్ కుమార్, శంకర్రావు, శ్రీనివాసులు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీ. సుహసిని, హెల్త్ క్లబ్ కన్వీనర్ డాక్టర్ పి.సుభాషిణి, డా. జె.లకన్ సింగ్, డా. బి. కల్పన, బి. సంతోషి, విద్యార్థులు పాల్గొన్నారు.