calender_icon.png 2 September, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోపాలపురం గ్రామంలో దొంగల బీభత్సం

01-09-2025 11:43:09 PM

11 తులాల గోల్డ్,20 తులాల వెండి, 5 లక్షల నగదు దోచుకున్న దొంగలు...?

క్లూస్ టీం ఆధారంగా కేసు నమోదు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం గోపాలపురం గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోపాలపురం గ్రామానికి చెందిన పేరూరి భాగ్యరాజు తన భార్యను అత్త ఇంటి నుండి తీసుకు రావడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఎర్రగుంట గ్రామానికి వెళ్లి రెండు రోజుల పాటు అక్కడే ఉండి, ఆగస్టు 30న ఉదయంతన ఇంటికి వచ్చి చూడగా, ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండగా బీరువాలు పగులగొట్టి బీరువాలో దాచిన 11 తులాల బంగారు ఆభరణాలు,

20 తులాల వెండి ఆభరణాలు, సుమారు 5 లక్షల నగదు మాయం అయ్యాయని సమాచారం, దొంగలు హారం,నల్లపూసల త్రాడు, పుస్తెలతాడు,మూడు ఉంగరాలు, కాళ్ల పట్టీలు, కడియాలు, కుందులు, వెండి ప్లేటు వంటి వస్తువులను దొంగిలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న హుజూర్ నగర్ ఎస్ఐ మోహన్ బాబు సంఘటనా స్థలాన్ని సందర్శించి క్లూస్ టీం సహాయంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దీంతో గోపాలపురం గ్రామంలో జరిగిన ఈ ఘటనతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.