calender_icon.png 15 December, 2025 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 17న సెలవు

15-12-2025 05:13:52 PM

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 17వ తేదీన జరగనున్న 3వ విడత పోలింగ్ లో భాగంగా ఆయా ప్రాంతాలలో సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు పోలింగ్ రోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటించడం జరిగిందని, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, సేవల అత్యవసరతకు లోబడి ఆ రోజు కార్యాలయానికి ఆలస్యంగా హాజరు కావడం/కార్యాలయం నుండి త్వరగా వెళ్లడం/తక్కువ వ్యవధి గైర్హాజరు విధానాన్ని ఉపయోగించుకునే అవకాశం కల్పించబడుతుందని తెలిపారు.

ఎన్నికల కోసం ఉపయోగించబోయే ప్రజా భవనాలు, విద్యాసంస్థల భవనాలు, ఇతర భవనాలకు పోలింగ్ రోజు ప్రభుత్వ సెలవు, పోలింగ్ రోజుకు ముందు రోజు స్థానిక సెలవుగా పరిగణించబడుతుందని తెలిపారు. ప్రకటించిన ప్రాంతాలలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు/సంస్థల ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ రోజు స్థానిక సెలవు ప్రకటించబడిందని తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఉన్న సంబంధిత అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు/వ్యాపార/పరిశ్రమ యాజమాన్యాలు తమ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పైన పేర్కొన్న రోజులను వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించాలని తెలిపారు.