calender_icon.png 1 November, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42% చట్టపరంగా రిజర్వేషన్లు ఇవ్వాలి

31-10-2025 12:11:31 AM

తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం చట్టపరంగా ఇవ్వాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్,  ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. పార్టీ పరంగా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని అన్నారు. జీవో బలంగా ఉందని,  చట్టపరంగా రాజ్యాంగ పరంగా,  న్యాయపరంగా బలంగా ఉందన్నా రు.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 243- డి6 ప్రకారం స్థానిక సంస్థలలోని బీసీ రిజర్వేషన్ పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాం గ అధికారం ఇచ్చిందన్నారు. 

అసెంబ్లీ చట్టం చేసిందన్నారు. బిసి జాక్ అధ్వర్యంలో 80 కుల సంఘాలు, 35 బీసీ సంఘాల సమావేశం గురువారం జరిగింది. ఈ సమా వేశానికి జాక్ ప్రతిష్ట నిర్మాణానికి భవిష్యత్ ఉద్యమ కార్యక్రమాలకు నిర్ణయం తీసుకొంది. ఈ సమావేశానికి జాక్ కన్వీనర్లుగా రాం మూర్తి గౌడ్, గుజ్జ సత్యం, అల్లంపల్లి రామకోటి, అధ్యక్షతన వహించారు. అనంతరం ఈ సమావేశానికి జాక్ రాష్ట్ర కన్వీన ర్లుగా ఎంపిక చేశారు. మేకల రాములు యాదవ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యకులు, కొండ దేవరయ్య రాష్ట్ర మున్నూరు కాపు సంఘం.

వెంకట్రావు రాష్ట్ర విశ్వ బ్రాహ్మణా సంఘం అధ్యకుడు, జయంత్ రావు రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు, కోలా శ్రీనివాస్ 38 కులాల సందార జాతుల అధ్య క్షులు, ఈశ్వరప్ప వీరశైవ లింగ బలిజ సం ఘం, విజయ్ కుమార్, పెరిక సంఘం,  శ్రీనివాస్ గౌడ్ గౌడ  సంఘం, మల్లేష్ వంశీ రాజ్ సంఘం, టి. శ్రీనివాస్ మేదర సం ఘం, బి. వెంకటయ్య ఆర్ఫన్ అసోసియేషన్ మరియు ఉద్యోగ సంఘాలు కుమార స్వా మి విద్యుత్ ఉద్యోగుల సంఘం, కృష్ణుడు బీసీ టీచర్ల సంఘం, డి. చంద్ర శేఖర్ గౌడ్ తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం, దాని కర్ణ దారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖా ఉద్యోగుల సంఘం, రామరాజు వాటర్ వరక్స్ ఉద్యోగుల సంఘం, జంపాల రాజేష్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధుల జాక్, స్వామి గౌడ్ ఉస్మానియా బీసీ విద్యార్ధుల జాక్ వర్కింగ్ ప్రెసిడెంట్, శ్రీనివాస్ గౌడ్ బీసీ ఉద్యోగుల సంఘం, కొమ్ము శ్రీనివాస్ యాదవ్ బీసీ మహాసభ, రాం మూర్తి గౌడ్ బీసీ విద్యార్ధి యువజన సంఘం, గుజ్జ సత్యం ఉపాధ్యకులు -జాతీయ బీసీ సంక్షేమ సంఘం, అల్లం పల్లి రామకోటి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నియమించారు.

వచ్చే సమావేశంలో మిగతా కుల సంఘాల కన్వీనర్లుగా నియమించే బాధ్యత కృష్ణయ్య అప్పజెప్పారు. బీసీ సంఘ నాయకులూ నీల వెంకటేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం, బర్క్ కృష్ణ అధ్యకుడు -రాష్ట్ర బీసీ సిన, అనంతయ్య, రాజేందర్, మోడీ రాందేవ్, చెరుకు మనికంత, రాజు నేత, పగిళ్ళ సతీష్, తిరుమలగిరి అశోక్, తదితరులు పాల్గొన్నారు.