calender_icon.png 1 November, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓవర్సీస్ నిధుల విడుదల

31-10-2025 12:12:52 AM

-విద్యార్థుల భవిష్యత్ కోసమే మంజూరు

-ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా నిర్ణయం

-మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి) : గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ర్ట ఆర్థిక పరిస్థితి క్షిష్టంగా ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని నిధులు విడుదల చేశామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్ బకాయిల విడుదల సందర్భం గా గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మా ట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులందరికీ విద్య ద్వారా సమాన అవకాశాలు, వారి ఉజ్వల భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఒక్కో విద్యార్థికి ఓవర్సీస్ పథకం కింద రూ.20 లక్షలు ఇచ్చామని, 2,288 విద్యార్థులకు గానూ సుమారు రూ. 304 కోట్ల నిధులు విడుదల చేసినట్టు వివరించారు. ఇప్పటివరకు 3,642 మంది విద్యార్థులకు రూ.463 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. అర్హత కలిగిన విద్యార్థులకు నేరుగా వారు బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమవుతుందన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను కొనసాగిస్తున్న తెలం గాణ విద్యార్థులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గమనించి ఓవర్సీస్ స్కాలర్ షిప్ నిధు లను విడుదల చేసినట్టు తెలిపారు. 

యూకే, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాతో పాటు పలు విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఊరట కల్పించిందన్నారు. సమావే శంలో సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్,కార్యదర్శి బుద్ధప్ర కాష్, కమిషనర్ క్షితిజ, ట్రైబల్ వెల్ఫేర్   అదనపు డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు.