calender_icon.png 26 September, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో 49 మద్యం షాపులకు రిజర్వేషన్ల ఖరారు

26-09-2025 01:05:20 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్

కామారెడ్డి, సెప్టెంబర్ 25 ( విజయక్రాంతి):తెలంగాణ నూతన మద్యం పాలసీ 2025-27 లో భాగంగా జిల్లాలో 49 మద్యం షాపుల నిర్వహణకు రిజర్వేషన్లను ఖరార్  చేశారు. డ్రా పద్ధతిలో సీసీ కెమెరాలు పర్యవేక్షణలో రిజర్వేషన్లను డ్రా పద్ధతిలో చేశారు. జిల్లాలోని 49 మద్యం దుకాణాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ తెలిపారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

జిల్లాలో 49 షాపులకు ఎస్సీ, ఎస్టీ, బిసి, గౌడ కులస్తుల రిజర్వేషన్ ఎంపిక కొరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా కలెక్టర్  ఆశీష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ మధ్య జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ, ఎస్టీ అభివృద్ధి శాఖ, బీసీ అభివృద్ధి శాఖల అధికా రుల సమక్షంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో డ్రా నిర్వహించారు.

జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలు ఉండగా వాటిలో 05 ఎస్సీ సామాజిక వర్గానికి, 02 ఎస్టీ సామాజిక వర్గానికి, 07బిసి గౌడ కులాలకు లాటరీ ద్వారా మద్యం షాపులను ఎంపిక చేసి వాటి ఆమో దానికి రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ కు పంపిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్,  జిల్లా ఎక్సైజ్ సూపరింటిండెంట్ హనుమంతరావు, జిల్లా ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారి వెంకటేష్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి  జయరాజ్, జిల్లా ఎస్టీ అభివృద్ధి అధికారి సతీష్, ఎక్సైజ్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.