calender_icon.png 26 September, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలహీన వర్గాలపై టౌన్‌ప్లానింగ్ కూల్చివేతలు

26-09-2025 01:07:06 AM

 నిజామాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): నిజామాబాద్ నగర పాలక సంస్థ లోని టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమాల పేరిట బడుగు బలహీన వర్గాల ఇళ్లనే కూల్చివేస్తున్నారని ప్రజల నుండి ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బిల్డర్లు ప్రైవేట్ సంస్థలు బడాబాబులు నిర్మిస్తున్న భవలాంతస్తుల భవనాల జోలికి టౌన్ ప్లానింగ్ అధికారులు వెళ్లడం లేదని ప్రజల నుండి ఆరోపణలు వస్తున్నాయి.

బడా బాబుల అక్రమ నిర్మాణాల వైపు టౌన్ ప్లానింగ్ అధికారులు కన్నెత్తి చూడడం లేదని నగరంలో అడుగడుగున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికిని అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ నగరంలోని అక్రమ కట్టడాలు స్థానిక సుభాష్ నగర్ లో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తు భవనం నిర్మాణం జరుగుతున్నప్పటికిని అధికారులు పట్టించుకోవడంలేదని అనుమతులు పరిమితంగా ఉన్నప్పటికీ పరిమితి దాటి నిర్మాణం జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు రెండంతస్తుల మేరకు అనుమతి ఉన్నప్పటికీ ఐదంతస్తుల నిర్మాణాలు కొనసాగిస్తున్నారూ. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు నిజామాబాద్ నగరంలోని మాలపల్లి సారంగాపూర్ ఆటోనగర్ సీఎం రోడ్ తదితర రహదారులపై భారీ ఎత్తున కట్టడాలు జరుగుతున్నప్పటికీ ఈ అక్రమ నిర్మాణాలకి అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా నగరంలోని వర్ని రోడ్డు ప్రాంతంలో మాజీ కార్పొరేటర్ ఒక అంతస్తుకు మాత్రమే అనుమతి తీసుకొని ఐదు అంతస్తుల భవనం నిర్మిస్తున్నప్పటికిని అక్రమ నిర్మాణాలపై అనేక ఫిర్యాదు అందినప్పటికీ అధికారులు స్పందించడం లేదు. అక్రమ భవన నిర్మాణదారుల నుండి పెద్ద ఎత్తున ముడుపులు ముట్టడంతోటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజల నుండి ఆరోపణలు వస్తున్నాయి.

ఇటీవల వరుసగా మున్సిపల్ రెవెన్యూ వివాహానికి చెందిన అధికారులు వరుసగా ఏసీబీ అధికారులకు పట్టు పడడం పెద్ద మొత్తంలో కరెన్సీ పట్టు పడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. లంచం పుచ్చుకుంటు అవినీతి నిరోధక శాఖ అధికారులకు మున్సిపల్ అధికారులు దొరకడమే ఎందుకు సాక్ష్యం. ముఖ్యంగా నిజామాబాద్ టౌన్ ప్లానింగ్ విభాగంలో భారీగా అవినీతి జరుగుతున్నట్టు వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. నగరంలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.