calender_icon.png 19 October, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిపల్లిలో బంద్ ప్రశాంతం

18-10-2025 08:54:24 PM

మేడిపల్లి (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. శనివారం ఉదయం నుంచి మేడిపల్లి పరిధిలోని ఉప్పల్ డిపో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ చేశారు. బీసీ సంఘాలు బిజెపి, కాంగ్రెస్, సిపిఐ, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉప్పల్ డిపో ముందు బైఠాయించి నిరసనలు ధర్నాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు వేముల నాదం గౌడ్, మేడోజు రామబ్రహ్మం, గుజ్జు రమేష్, కే వెంకటేష్ గౌడ్, లగ్గాని సోమేశ్ గౌడ్, విజయలక్ష్మి, శారద పరమేశ్వరి, అంజమ్మ బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.