26-09-2025 12:28:19 AM
4 ప్రభుత్వ కొలువులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచిన శశిధర్ రెడ్డి
ఆదిలాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచాడు ఆదిలాబాద్ కు చెందిన సరసన్ శశిధర్ రెడ్డి. చిన్ననాటి నుండి కష్టపడి చదివి వివిధ ప్రభుత్వ కొలువులకు సాధించిన ఆయన ప్రస్తుతం గ్రూప్ వన్ ఉద్యోగం సాధించాడు. గత రాత్రి విడుదలైన ఫలితాలలో అసిస్టెంట్ ట్రెజరర్ ఆఫీసర్ గా మల్టీ జోన్ -1 కు ఎంపిక అయ్యారు.
బోరజ్ మండలం పిప్పర్ వాడ గ్రామానికి చెందిన రాజీవ్ రెడ్డి- లక్ష్మీ దంపతుల కుమారుడు సరసన్ శశిధర్ రెడ్డి 2017 సంవత్సరంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. అంతకుముందు 2016 లో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం రాగ, దానికి వెళ్లలేదు.
ఆ తర్వాత 2024 లో గ్రూప్ ఫోర్ ఉద్యోగం సాధించగా, దానికి వెళ్లలేదు. తాజాగా 2025 లో గ్రూప్ వన్ లో అసిస్టెంట్ ట్రెజరర్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాడు. దీంతో పలువురు శశిధర్ రెడ్డిని అభినందించారు. కాగా తాను ఈ నాలుగు ఉద్యోగాలు సాదించడంలో తన తల్లిదండ్రులు, భార్య పల్లవి సహకారంతో పాటు అక్క బద్దం స్వాతి ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు.