calender_icon.png 25 October, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పందించిన అధికారులు ట్రాన్స్‌ఫార్మర్స్ వద్ద ఉన్న పిచ్చిమొక్కల తొలగింపు

24-10-2025 12:00:00 AM

వెంకటాపూర్(రామప్ప), అక్టోబర్23, (విజయక్రాంతి):ములుగు జిల్లా వెంకటపూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఎదురుగా ట్రాన్స్ఫార్మర్స్ వద్ద ఉన్న పిచ్చిమొక్కలు ప్రమాదకరంగా మారింది. ఇది గుర్తించిన ‘విజయక్రాంతి‘ తమ పత్రికలో ‘ప్రమాదం అంచున ట్రాన్స్ఫార్మర్స్‘ అనే వార్తా కథనాన్ని ప్రచురించగా.. గురువారం గ్రామపంచాయతీ కార్యదర్శి స్పందించారు. కాగా.. ట్రాన్స్ఫార్మర్స్ చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించే చర్యలు చేపట్టారు.

గ్రామపంచాయతీ కార్మికులను వెంటనే పిచ్చిమొక్కలను తొలగించాలని కార్యదర్శి ఆదేశించారు. ట్రాన్స్ఫార్మర్స్ చుట్టూ ఉన్న పొదలు, పిచ్చిమొక్కలను కార్మికులు కలిసి తొలగించారు. దింతో ప్రమాదాన్ని ముందే గుర్తించిన ‘విజయక్రాంతి‘ పత్రికకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

వర్షాకాలంలో పెరిగిన పొదలు, పిచ్చిమొక్కలు కారణంగా షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో ఇలాంటి ప్రమాదాలను ముందే గుర్తించి ప్రమాదాలు జరగకముందే చర్యలు చేపట్టాలని పలువురు అభిప్రాయపడ్డారు. పంచాయతీ కార్యదర్శి స్పందించి పిచ్చిమొక్కలను తొలగించడం అభినందనీయమని, ఇలాంటి పనులు తరచుగా చేయిస్తే ప్రమాదాలు తగ్గుతాయని గ్రామస్తులు తెలిపారు.