calender_icon.png 25 October, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

24-10-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

రేగొండ,అక్టోబర్ 23(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని భూపలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.గురువారం కలెక్టర్ మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల పైలెట్ గ్రామమైన లింగాల గ్రామాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.హౌసింగ్ పీ డి లోకిలాల్ ను కలక్టర్ వివరాలు అడగగా లింగాల లో 50 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ఇందులో 7 ఇండ్లు పూర్తిస్థాయిలో నిర్మాణం అయ్యాయని స్లాబ్ లెవల్ వరకు 21,రూఫ్ లెవల్ లో 8 పూర్తి అయినట్లు ఆయన తెలిపారు.

పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను కలక్టర్ అభినందించారు.వివిధ స్థాయిలో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి సకాలంలో బిల్లులు పొందాలని కలెక్టర్ లబ్ధిదారులకు సూచించారు. గృహ నిర్మాణాలకు సంబంధించి ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ గ్రామంలోనీ ప్రాథమిక పాఠశాలను సందర్శించి పిల్లల హాజరు,మౌలిక సదుపాయాల గురించి ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

గ్రామపంచాయతీ నర్సరీ నీ సందర్శించి ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసుకున్న ప్రతి లబ్ధిదారునికి 10 మొక్కలు పంపిణీ చేసి పచ్చదనాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ లొకిలాల్, హౌసింగ్ డిఈఈ శ్రీకాంత్,రేగొండ ఎమ్మార్వో శ్వేత రావు, ఎంపిడిఓ వేంకటేశ్వర రావు,హౌసింగ్ ఏఈ ప్రేమలత,పంచాయితీ కార్యదర్శి రాము,తదితరులు పాల్గొన్నారు.