calender_icon.png 22 December, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ మెగా లోక్ అదాలత్‌కు స్పందన

22-12-2025 02:39:04 AM

మొత్తం 2,247 సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కారం

తగాదాలకు రాజీమార్గంతో చెక్: జడ్జి ప్రవీణ్‌కుమార్

ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 21(విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం కోర్టు ఆవరణలో ఆదివారం రంగారెడ్డి జిల్లా 15వ అదనపు జిల్లా జడ్జి జీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ మెగా లోక్ అదాలత్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి ప్రవీణ్ కుమా ర్ మాట్లాడుతూ సివిల్, క్రిమినల్ తగాదాలను రాజీ మార్గం ద్వారా కక్షీదారులు ఇద్ద రూ పరిష్కరించుకోవాలని, తద్వారా డబ్బు, సమయం ఆదావుతుందని తెలిపారు.

అదేవిధంగా పేద, నిరుపేదలకు వృద్ధులకు మండల లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సేవ సలహాలు ఇస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పా రు. ఈ కార్యక్రమంలో మొత్తం 2,247 సివి ల్, క్రిమినల్  కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ రిటాలాల్ చందు, ప్రిన్సిపల్ జూనియర్ యశ్వంత్ సింగ్, అదనపు జూనియర్ సివిల్ జడ్జ్  హిమబిందు, అధ్యక్షుడు ముద్దం వెంకటేశం, స్పెషల్ మెజిస్ట్రేట్ జయసింహ, ఇబ్రహీంపట్నం, యాచా రం మంచాల, ఫార్మాసిటీకి సంబంధించిన సీఐలు, సీనియర్ న్యాయవాది డీ జగన్, గణేష్ కుమార్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.