calender_icon.png 13 August, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రియాంక గాంధీతో రేవంత్‌రెడ్డి భేటీ

25-07-2025 01:40:09 AM

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్ర నాయకురా లు, ఎంపీ ప్రియాంకగాంధీతో సీఎం రేవంత్‌రెడ్డి  సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణాలో చేపట్టిన కులగణన సర్వేకు సంబంధిం చిన వివరాలను ప్రియాంకకు రేవంత్‌రెడ్డి  వివరించారు. ఎన్నికల్లో, విద్య, ఉద్యోగాల్లో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషను కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయా న్ని ఆమె అభినందించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించేందుకు తాము అండగా ఉం టామని ప్రియాంక హామీ ఇచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేసారు.