29-09-2025 12:11:49 AM
అధ్యక్షులు, కార్యదర్శులుగా గౌరు శ్రీనివాస్, వెంకటరమణ చౌదరి ఏకగ్రీవం
మిర్యాలగూడ సెప్టెంబర్ 28 విజయ క్రాంతి :- మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గం 2025-27 స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జరిగాయి. ఎన్నికల అధికారిగా రిటైర్డ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పందిరి రవీందర్ వ్యవహరించారు. మిర్యాల గూడ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా గౌరు శ్రీనివాస్, కార్యదర్శి 1 బోగవెల్లి వెంకటరమణ చౌదరి (బాబి), కార్యదర్శి టు గా పోలిశెట్టి ధనుంజయ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మిల్లర్స్ ఎన్నికల్లో మొత్తం 90 ఓటర్లు.. ఉపాధ్యక్ష పదవి కోసం మా శెట్టి శ్రీనివాస్, గోళ్ళ రామ శేఖర్ లు పోటీ పడగా జరిగిన ఎన్నికల్లో మా శెట్టి శ్రీనివాస్ కు 15 ఓట్లు, రామ్ శేఖర్ 69 ఓట్లు రాగా రామ్ శేఖర్ విజయం సాధించారు. కోశాధికారి పదవికి జరిగిన ఎన్నికల్లో చిల్లం చర్ల శ్రీనివాస్, గందె రాము పోటీ పడగా శ్రీనివాస్ కు 42 ఓట్లు, రాముకు 44 ఓట్లు వచ్చాయి దీంతో రాము కోశాధికారిగా విజయం సాధించినట్లు ప్రకటించారు.
10 మంది డైరెక్టర్ల పదవి కోసం 30 నామినేషన్లు రాగా ‘డ్రా‘ పద్ధతిలో పది మందిని ఎంపిక చేశారు.గౌరు శంకర్, నీలా పాపారావు, పోతుగంటి కృష్ణ, మలిగిరెడ్డి మాధవ రెడ్డి, రాయిని శ్రీనివాస్.కొమ్మన పట్టాభిరామ్‌గుంటి గోపి, ఆతుకూరి గురునాథం, గుర్రం వెంకటరత్నం, శ్రీరంగం నర్సయ్య ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి రవీందర్ ప్రకటించారు.
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, గుడిపాటి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు చిలంచర్ల విజయ్ కుమార్, మంచుకొండ వెంకటే శ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ భార్గవ్, తదితర రైస్ మిల్లర్లు, పాల్గొన్నారు. కొత్త పాలకవర్గంకు ఘనంగా సన్మానించారు. స్వీట్లు తినిపించారు.