29-09-2025 12:10:41 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్28(విజయక్రాంతి): రాష్ట్ర పర్యాటక శాఖ నుంచి హాస్పిటాలిటీ సంస్థ(పైవేట్) విభాగంలో ప్రతిష్టాత్మకమైన టూరిజం ఎక్సలెన్స్ అవా ర్డు 2025కుగాను ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ శ్రీశక్తి అందుకుంది. ఈ అవార్డును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా శనివారం హైదరాబాద్‌లోని శిల్పరామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈసంస్థ అందుకుంది.