calender_icon.png 29 September, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండాపూర్‌లో యుతి క్లినిక్ ప్రారంభం

29-09-2025 12:12:19 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ప్రజలకు ఆధునిక, నాణ్యమై న ఆరోగ్యసేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్స్ సమీపంలో యుతి క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథు లుగా కేంద్ర బొగ్గు , గనుల శాఖ మంత్రి  జి. కిషన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ  సి. సురేష్‌రెడ్డిలు హాజ రయ్యారు.

యుతి క్లినిక్‌ను ప్రముఖ వైద్యులు కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ డా. ద్రోణంరాజు విభు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డా. పుష్పక్ రెడ్డి చాడ, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సెక్సాలజిస్ట్ డా. కంభంపాటి శ్రీనివాస్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డా.కృష్ణ సంయుక్తంగా స్థాపించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆరో గ్య సేవలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండడం అత్యంత అవసరమన్నారు. క్లినిక్ ఫౌండర్స్ మాట్లాడుతూ యుతి క్లినిక్‌లో ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు, నిపు ణులైన వైద్యుల బృందం, ఆరోగ్య పరీక్షలు, ప్రత్యేక విభాగాల చికిత్సలు అన్నీ ఒకే చోట లభిస్తాయని పేర్కొన్నారు.