16-09-2025 12:31:40 AM
అధికారులు మారిన మారని సమాచార బోర్డు చిరునామా
మణుగూరు, సెప్టెంబర్ 15 ( విజయక్రాంతి) :మండలం విద్యాశాఖ కార్యాలయం నందు, ఏర్పాటు చేసిన సమాచార హక్కు చట్టం బోర్డులో అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతుంది. గతంలో పనిచేసిన అధికారులు బదిలీ అయినా ఆ అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లు ఉండడం గమనార్హం. ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిలవటద్దమని ప్రత్యక్షంగా చెప్పవచ్చు. గతంలో మండల విద్యాశాఖ అధి కారిగా వీరస్వామి విధులు నిర్వ ర్తించారు.
జిల్లా అధికారులు చేపట్టిన బదిలీల సందర్భంగా & జిల్లాలో జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు మారారు. ప్రస్తుతం మండల విద్యాశాఖ అధికారిణిగా స్వర్ణ జ్యోతి బాధ్యతలు నిర్వర్తిస్తు న్నారు. అయినా ఇప్పటి వరకు సమాచార చట్టంబోర్డులో అధికారుల పేరు మార్చకపోవడం, పాత అధికారుల పేర్లతోనే బోర్డు దర్శనమిస్తోంది. సామాన్యునికి వజ్రా యుధం లాంటి చట్టమైన సమాచార హక్కు చట్టానికి విద్యాశాఖ అధికారులు తూట్లు పొడుస్తున్నారని, సామాజిక సేవకులు కర్నె బాబురావు ఆరోపిస్తున్నారు. ప్రజలకు స్పష్టమైన సమాచారం తెలిపేందుకు సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయని శాఖలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.