calender_icon.png 16 September, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను ఆదుకోండి.. వారికి సహాయం చేయండి

16-09-2025 12:33:25 AM

* రైతులకు భోజన వసతిని ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 15, (విజయక్రాంతి):యూరియా కోసం పడిగాపు లు కాసే రైతు ఆకలి బాధను తీర్చేందుకు టిఆర్‌ఎస్ నాయకుడు నడుం బిగించారు. పాల్వంచలోని సొసైటీ కార్యాలయం వద్ద యూరియా బస్తాల కోసం రైతులు దూర ప్రాంతాల నుండి ఉదయాన్నే వచ్చి రాత్రి వరకు నీళ్లు లేక, తిండి లేక క్యూ లైన్ లో నిలబడి ఇబ్బంది పడటం చూసి బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ సోమవారం వారికి భోజన సదుపాయం కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన  మా ట్లాడుతూ రైతే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు ఆరుగాలం కష్టపడి దాన్యం పండిస్తేనే మన నోట్లోకి ఐదు వేళ్ళు వెళతాయి. రైతు వ్యవసాయం చేయ డం ఆపేస్తే మనం ఆకలి కేకలతో అలమటిస్తాం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి ఎవరికి చేతనైనంత వరకు వారు రైతులకు సహాయం చేయాలని కోరారు. ఇది నేను సమాజానికి చెప్పడమే కాకుండా ఆచరించి చూపించాలనే ఉద్దేశంతో గత 45 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సొసైటీ కార్యాలయాల వద్ద యూరియా బస్తాల కోసం రైతులు దూర ప్రాంతాల నుండి ఉదయాన్నే బయలుదేరి వచ్చి నీళ్ళు లేక, తిండి లేక రాత్రి వరకు క్యూ లైన్ లో వేచి ఉండి, అరిగోశ పడుతూ కష్టాలు పడటాన్ని చూసి చలించిపోయన్నారు.

ఈ పాల్వంచ మండల రైతుల కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నాకు చాతనైనంతలో ఈ భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగిందని, నిత్యం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని చూసే కేసీఆర్, కేటీఆర్ గార్ల ఆశయాలకు అనుగు ణంగా, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తన్నీరు హరీష్ రావు, వద్దిరాజు రవిచంద్ర ఇండ్ల దగ్గరికి దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఆకలికి అలమటించ కూడదని వారు ఏర్పా టు చేస్తున్న భోజన సదుపాయాన్ని ప్రత్యక్షంగా చూసి నేను ఇక్కడ రైతుల కోసం ఈ భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని చూసి ఇంకొందరు దాతలు, బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు రైతు ల కష్టాన్ని గుర్తించి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుం డి రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కరువయ్యాని, ముఖ్యంగా రైతుల యూరియా కష్టాలను చూస్తుంటే 2004 నుండి 2014 వరకు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కాలం లో రైతులు ఎరువుల కోసం క్యూ లైన్ లో చెప్పులు పెట్టి రోజుల తరబడి తిండి, తిప్ప లు, నిద్రాహారాలు మాని పోలీసుల లాఠీ చార్జీల రుచి చూసి జైల్లకు కూడా వెళ్లడం జరిగిందని, 2014 నుండి 2023 వరకు కేసీఆర్ పాలనలో రైతుల కష్టాలను గుర్తించిన ఆయన మన రాష్ట్రానికి కావాల్సినంత యూ రియాని తెప్పించి తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో రైతులకు ఎటువంటి ఇబ్బం దులు కలగకుండా, క్యూలైన్లు లేకుండా అడిగినంత ఎరువులను అందించారు.

2023 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ అప్పుడే చెప్పారు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మళ్లీ కష్టాలు పడాల్సి వస్తుందని, ఆయన చెప్పినది అక్షర సత్యం అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 21 నెలల కాలంలోనే ప్రజలను ఎన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నదో ప్రత్యక్షంగా చూస్తున్నా రని, గత 45 రోజులుగా రైతులు యూరి యా కోసం సొసైటీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఎన్నికలప్పుడు ఓట్ల కో సం ప్రజల వద్దకు వెళ్లి దండాలు పెట్టిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని, మళ్ళీ ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకు వస్తారా అని ఆయన ప్రశ్నించారు.

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు స రిపడా యూరియా అందించాలని, యూరి యా అందించడం చేతకాకపోతే గద్దె దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ కార్యక్ర మంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు సంగ్లో త్ రంజిత్, మారుమూళ్ల కిరణ్, కొత్తచెరువు హర్షవర్ధన్, పూజాల ప్రసాద్, ఆలకుంట శోభన్, అడపా సత్యనారాయణ, తోట లోహిత్ సాయి, పోసారపు అరుణ్, కుమ్మరికుంట్ల వినోద్, గోవాడ గుణ చరిత్, గజ్జెల రితిక్, కొండే మనోజ్, కూరెళ్లి మురళి మోహన్, ఆలి, బర్ల క్రాంతి, కొమ్మాలపాటి నిఖిల్, గడ్డం శ్రీకాంత్, తోట సతీష్ తదితరులు పాల్గొన్నారు.