16-09-2025 12:19:52 AM
- భయాందోళనలో ఆయకట్టు రైతులు
- నీటిమట్టం 23 క్యూసెక్కులు చేరుకుంటే ప్రమాదమే
- ఇరు రాష్ట్రాల అధికారులు అప్రమత్తం
అశ్వారావుపేట, సెప్టెంబరు 15, (విజయ క్రాంతి ) :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం లోని పెదవాగు ప్రాజెక్ట్ ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ఎప్పుడు, ఏం జరుగు తుందో తెలియక. ఆయుకట్టు గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో కాలం వెళ్ల దీస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం సాయంత్రం వరకు అశ్వారావుపేట పరిసరాల్లో వర్షం దంచి కొట్టింది. దీనికి తోడు పెడవాగు ప్రా జెక్టు పై భాగ మైన ఆంధ్రాలోని గుబ్బల మంగమ్మ పై బాగం లోని అటవీ ప్రాంతం లో అతి భారీ వర్షం నమోదైంది. దీంతో వా గులు వంకలు పొంగి పొర్లి కొన్ని గంటల్లోనే ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరింది.
గత ఏడాది జూలై 18న పెదవాగు ప్రాజెక్టు కట్టు కు గండి పడడంతో... రూ5 కోట్లతో ప్రాజెక్టు లోపల రింగ్ బండను నిర్మించిన నిపారుదల శాఖ అధికారులు, అప్పటి నుంచి ప్రాజె క్టు మూడు గేట్లను పూర్తిగా ఎత్తి ఉంచారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఉండడంతో ఆదివారం రాత్రి 9గంటలకు పెదవాగులోకి 22 క్యూసెక్కుల నీరు చేరింది. వచ్చిన నీరు వచ్చినట్లే గేట్ల నుంచి బయటకు వెళ్లిపోయాయి. ప్రా జెక్టు లోపల నిర్మించిన రింగ్ బండ్ సామర్థ్యం 25 మీటర్లు ఉండగా. 25 మీటర్లను దాటి రింగ్ బండలోకి నీరు చేరింది. మ రి కొద్దిసేపు వరద కొనసాగితే రింగ్ బండకు ప్రమాదం ఏర్పడి అందులో నీరంతా గ్రా మాలు, పంట పొలాలపై పడే ప్రమాదం పొంచి ఉంది.
గతేడాది వరదను ఇంకా కళ్ల ముందు నుంచి మరచిపోలేని అయకట్టు గ్రామాలైన గుమ్మడపల్లి, కొత్తూరుతో పాటు ఏపీలోని కమ్మరి గూడెం, రాళ్ళవాగు, మేడేపల్లి, ఊటుగూడెం, అల్లూరినగర్ తదితర గ్రామాల ప్రజలు ఆదివారం రాత్రి ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బిక్కు బిక్కుమం టూ కాలం వెళ్లదీశారు. చిమ్మ చీకటిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి దీంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి గ్రామాలలో నెలకొంది. అప్పటికే ఆయా గ్రామాల పరిధిలోని పంట పోలాలలోకి నీరు చేరు కుంది అటు ఏపీ, ఇటు తెలంగాణ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు. జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం ఎస్‌ఆర్డీపీ బృందాలు, బోట్లు గజ ఈతగాళ్లతో పాటు డ్రోన్లు ను పంపింది. ఇదే సమయంలో పోలీసులు, రెవె న్యూ, నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమ య్యా రు.
రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో డీఆర్ డి ఎఫ్ బృందం. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమ య్యారు. ప్రజలను హెచ్చరించడంతో పాటురాత్రంతా ప్రా జెక్టు కట్టుపైనే పహారా కాసారు. నిమిష నిమి షానికి నీటి ఇన్ ఫ్లో ఎంత వస్తుందో, అవుట్ ఫ్లో ఎంత వెళుతుందోఅంచనా వేస్తూ ఉన్నతాధికారులకు సమాచారం పంపారు. అయి తే ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా పై భా గంలో, స్థానికంగానూ వర్షం నిలిచిపోవడంతో కొన్ని గంటలపాటు నీరు పెరగకపో వడం తో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు మరో రెండు రోజులపాటు తుఫాన్ ఉందని హెచ్చరికల నేపథ్యంలో మళ్ళీ వర్గం పడితే, జరగరానిది ఏమై నా జరిగి పోతుందేమోనన్న భయాపదోళనలో అటు అధికారులు, ఇటు స్థానికులు భయాందోళనలో కాలం వెళ్ల దీశారు.
అర్థరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత వరద ప్రవాహం తగ్గుతుందని గమనించారు.పై ప్రాంతంలోవర్షం రాకపోవడంతో.. హమ్మయ్య అంటూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అర్ధరాత్రి తర్వాత ప్రాజెక్టులోకి వచ్చి చేరిన నీరంతా బయటకు వెళ్లిపోయింది. ఇన్ ఫ్లో బాగా తగ్గింది.తెల్లవారేసరికి ప్రాజెక్టులో నీరు పూర్తిగా తగ్గి పోయింది. సోమవారం కూడా వర్షం పడకపోవ డంతో... పెద్ద ప్రమాదం తప్పిందని అటు అధి కారులు, ఇటు స్థానికులు ఊపిరి పీల్చుకు న్నారు. 16,000 ఎకరాల ఆయకట్టు కలిగిన పెదవాగు ప్రాజెక్టు ఏపీ, తెలంగాణ ప్రాంతాలలో విస్తరించి ఉంది. గత ఏడాది కట్ట తెగిన తర్వాత ప్రాజెక్టు పునర్నిర్మిణానికి రూ.90కోట్లకు పైగా ఖర్చు అవుతుందని, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు కేటాయించి, కట్ట సామర్థ్యాన్ని పెంచి పునర్నిర్మిస్తామని ప్రక టించాయి.
తాత్కాలికంగా రూ.5కోట్లతో రింగ్ బండను నిర్మించి కొంతమేర పంటలకు ఆసరా కల్పించాయి. కనీసం ఈ ఏడా దైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకొని ప్రాజెక్టు పునర్నిర్మాణం చేపట్టకపోతే ప్రతీ ఏటా వర్షాకాలం వచ్చిందంటే ఆయా గ్రామాలకు ముప్పు తప్పదు. ఈ నేపథ్యంలో రెండు ప్రభు త్వాలు తక్షణమే ప్రాజెక్టు పనులు చేపట్టాలని ఆయుకట్టు రైతులు కోరుతున్నారు. గత ఏడాది కోట్లాది రూపాయల విలువ చేసే పంట, ఇళ్లతో పాటు పొలాల్లో ఇసుక మేటలు వేసి తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మున్ముందు ఏవైనా విపత్తు జరిగితే మళ్లీ అంత నష్టం జరిగే తట్టుకునే శక్తి తమకు లేదని, తమను ఆదుకోవాలనిరైతులు కోరుతు న్నారు.