20-10-2025 12:16:37 AM
9 పోలీసు బృందాలతో సెర్చింగ్
నగర శివారులో చిక్కిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్
నిజామాబాద్ అక్టోబర్ 19:(విజయ క్రాంతి) రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిసిఎస్‌కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ఎట్టకేలకు పోలీసులు పురోగతి సాధించారు.సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ పాత నేరస్తుడు రియాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కానిస్టేబుల్ హత్య కేసులో రాష్ట్ర డిజిపి సైతం స్పందించి త్వరగా ఈ కేసును చేదించాలని ఆదేశాలు జారీ చేశారు.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హంతకుడు రియాజ్ ను పట్టుకోవడానికి జిల్లా సిపి సాయి చైతన్య 9 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.తీవ్ర గాలింపులు చేపట్టిన పోలీసు దళాలు ఎట్టకేలకు రియాజుకి కనిపెట్టాయి.నగర శివారులోని 6 టౌను పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్సపల్లి ప్రాంతంలో శనివారం రాత్రి నిందితుడు రియాజ్ ఉన్నటువంటి అందిన సమాచారం మేరకు ఆ ప్రాంతంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
పోలీసుల తనిఖీల్లో హంతకుడు రియాజ్ ఉపయోగించిన ద్విచక్ర వాహనం కెనాల్ కట్ట వద్ద లభించింది.నిందితుడు కెనా ల్ నుండి పారిపోయి ఉండొచ్చని తొలత పోలీసులు భావించినప్పటికిని డ్రోన్ల సహాయంతో ఆ ప్రాంతాన్నంత జల్లెడ అయినప్ప టికిని నిందితుడి ఆచూకీ లభించలేదు. సారంగాపూర్ లోని ఓ పాడుబడిన లారీ క్యాబిన్లో నక్కి ఉన్న రియాజ్ ని అదుపు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు.
పోలీసులను పసిగట్టి దూకి పోతుం డగా పట్టుకోడానికి ప్రయత్నించిన పై కత్తితో దాడి పాల్పడ్డాడు. హంతకుడు రియాజ్ పారిపోతుండడంతో ద్విచక్ర వాహనాలపై వెంటాడుతున్న పోలీసులు పట్టుకో మని అరవడంతో స్థానిక నెహ్రు నగర్ కు చెందిన ఆసిఫ్ రియాజ్ ను పట్టుకోవడానికి ప్రయత్నించగా తన వద్ద ఉన్న కత్తితో రియాజ్ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆసిఫ్ కు ఎడమ చెయ్యి తెగడం తో పాటు తీవ్ర గాయాలయ్యాయి.
పెనుగులాటలో ఆసిఫ్ తో పాటు రియాజ్ కూడా గాయాలు అయ్యాయి.ఆప్పటికే వెంబడిస్తున్న పోలీసులు చేరుకొని చుట్టుముట్టి రియాజ్ ను అదుపులోకి తీసుకున్నారు.ఈ పద్యంలో కానిస్టేబుల్ ను హత్య చేసిన రియాజ్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారని ప్రజలు ఊహించారు. అందుకు తగ్గట్టుగానే కొన్ని మీడియాల్లో రియాజ్ ఎన్కౌంటర్ అంటూ వార్తలు గుప్పుమన్నాయి.
రియాజ్ పై ఎలాంటి కాల్పులు జరగలేదు : నిజామాబాద్ సీపీ
సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ న్యాయం కత్తితో పొడిచే హత్య చేసిన అంతకుడురియాజ్ పై ఎలాంటి ఎన్కౌంటర్ జరగలేదనీ నిజామాబాద్ సిపి సాయి చైతన్య మీడియాకు వివరాలు వెల్లడించారు. రియాజ్ ఎన్కౌంటర్ పై నిజాంబాద్ సిపి హాయ్ చైతన్య మాట్లాడుతూ. రియాజ్ పై ఎలాంటి కాల్పులు జరపలేదని, ప్రస్తుతం రియాజ్ ప్రాణాలతో నే ఉన్నారని స్పష్టం చేశారు.కానిస్టేబుల్ హత్య కేసులో రియాజ్ ను అదుపులోకి తీసుకున్నామని, ఆయన తెలిపారు.
నిందితుడు రియాజ్ ఓ వ్యక్తితో ఘర్షణ పడుతుండగా అతనికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆయనను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యులచే చికిత్స అందిస్తున్నామన్నారు. అయితే రియాజ్ అరెస్టు చేస్తున్న సమయంలో అసిఫ్ అనే వ్యక్తితో గొడవకు పాల్పడుతుండ గా ఆ పెనుగులాటలో ఆసిఫ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా రియాజ్ ను అక్కడి పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు.