12-09-2025 11:45:41 PM
నిర్మల్,(విజయక్రాంతి): విద్యార్థుల్లో దాగివున్న కళా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే విద్యాశాఖ కళా ఉత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న అన్నారు . నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి కళా ఉత్సవ పోటీలను నిర్వహించి వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ కళా ప్రదర్శనలను ప్రదర్శించారు. వీటిలో ఉత్తమ వైపున వాటిని ఎంపిక చేసి విద్యార్థులకు ప్రశంస పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.