12-09-2025 11:49:24 PM
మందమర్రి,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉచిత నాణ్యమైన విద్య అందుబాటు లో ఉంటుందని ప్రతి ఒక్కరు ప్రభుత్వ విద్యను సద్విని యోగం చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్ రాజేశ్వర్ కోరారు. మండలం లోని బొక్కలగుట్ట ప్రాథమిక ఉన్నత పాఠశాల లోని విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తులను శుక్రవారం పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని విద్యార్థులు ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు దుస్తులు పుస్తకాలు విద్యాబోధన మధ్యాహ్న భోజనం పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటుందని అంతేకాకుండా అర్హులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన జరుగుతుందని ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.