13-12-2024 09:50:03 AM
ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
పెద్దపల్లి, (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలో శుక్రవారం ఉదయం కరీంనగర్ వైపు నుంచి గోదావరిఖని వైపుకు వెళుతున్న మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు అతివేగంగా వస్తూ పక్కనున్న కల్వర్టుకు ఢీ కొట్టింది. దీంతో వాహనం భారీగా ధ్వంసం అయింది. ఈ సప్రమాదంలో డ్రైవర్ బతోపాటు మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలు కావడంతో క్షతగాత్రులను రామగుండం ప్రభుత్వ హాస్పటల్ కి స్థానికులు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.