calender_icon.png 6 August, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలనీవాసుల దాహార్తి తీర్చిన మాజీ కౌన్సిలర్

05-08-2025 10:17:51 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): పదవీకాలం ముగిసిన కాలనీవాసుల కష్టాలు తీరుస్తున్న తాజా మాజీ కౌన్సిలర్ ఉదంతం ఇది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలోని ఐదవ వార్డు కౌన్సిలర్ పరిమి సురేష్ అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్టాలను పంచుకుంటూ సొంత ఖర్చులతో దాహార్తి తీర్చి తాగు నీటిని అందించాడు.

ఐదవ వార్డులోని కరీం కాలనీలో మంచినీటి ఎద్దడి సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే సొంత డబ్బులు సుమారు  రూ.16000 వెచ్చించి నూతన మోటార్, పైపులైన్, వైరు స్టార్టర్, విద్యుత్ సరఫరా ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీటి సమస్యను తీర్చారు. మంగళవారం మోటార్ ద్వారా బోర్ లోని నీటిని కాలనీవాసులకు అందించారు.