05-08-2025 10:13:24 PM
పేరుకుపోయిన చెత్తను ఆశాల చైతన్యంతో క్లీన్ అండ్ గ్రీన్
పల్లెల్లో పరిశుభ్రత స్ఫూర్తి చాటాలి: వైద్యాధికారి డాక్టర్. రాజేష్
పెన్ పహాడ్: పరిశుభ్రతను పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం మన చేతిలో ఉంటుందని, అందుకు వైద్య సిబ్బంది ఆశాలు పల్లెల్లో పరిశుభ్రత స్ఫూర్తిని అందించాలని మండల వైద్యాధికారి డాక్టర్ రాజేష్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా పీహెచ్సీలో అలుముకున్న పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు.
వర్షాకాలం సమీపించినందున ఆశాలు ఏఎన్ఎంలు కలసి గ్రామాలలో పచ్చదనంతో పాటు పరిశుభ్రతపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. మలేరియా, డయేరియా డెంగ్యూ టైఫాయిడ్ తదితర ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే ముందస్తుగా పరిశుభ్రత పాటించినప్పుడే ఈ రోగాలు దరిచేరవన్నారు. వైద్య సిబ్బంది తమ తమ గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండే విధంగా ప్రజలకు అవగాహనా కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశలు పాల్గొన్నారు.