calender_icon.png 6 August, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వేచ్ఛ యూత్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

05-08-2025 10:32:08 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి స్వేచ్ఛ యూత్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కంటలే రాకేష్, ఉపాధ్యక్షుడిగా నిట్టు కిషోర్, ప్రధాన కార్యదర్శిగా వడ్ల రాజేష్, సహాయ కార్యదర్శిగా చిన్నోల బబ్లూ, కోశాధికారిగా చిన్నోళ్ల రాహుల్, సలహాదారులుగా చిన్నోళ్ల రుషికేశ్, కార్యవర్గ సభ్యులుగా కాసర్ల శ్రీకాంత్, చిన్న రాజు, పెద్ద రాజు, రాజేష్ పాటిల్, రజినీకాంత్, రాజేష్, అశోక్, తరుణ్, రాకేష్, గౌతం, సాయి తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.