05-08-2025 10:27:30 PM
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): వాటర్ ట్యాంకర్ బైక్ ను ఢీ కొనడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మూసాపేట్ కు చెందిన దేవరగుట్ట నిఖిల్ ప్రగతి నగర్ అలీప్ సర్కిల్ సమీపంలో బైక్ పై వెళ్తుండగా వెనుక నుండి వాటర్ ట్యాంకర్ అతివేగంతో అదుపుతప్పి ఢీ కొట్టింది.
దీంతో నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ పరారిలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.