23-07-2025 04:31:59 PM
ఏపీ ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు..
హుజూర్ నగర్/చింతలపాలెం: ఏపీ ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు అయినా సంఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District) చింతలపాలెం మండలంలోని దొండపాడు గ్రామం సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన కందుకూరి కోటేష్(30) తాపీ పని నిమిత్తం వెళ్తుండగా మార్గమద్యంలో దొండపాడు గ్రామంలోని గంగమ్మ గుడి వద్ద జగ్గయ్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అతను ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కోటేష్ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై బాధితుడి కుటుంబ సభ్యులు చింతలపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.