23-07-2025 04:27:47 PM
నూతనకల్ (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిహెచ్ఓ చరణ్ నాయక్(CHO Charan Nayak) అన్నారు. బుధవారం మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో కురుస్తున్న వర్షాలకు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వీధులలో శానిటేషన్ బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ఇంటి పరిసరాలలో వర్షపు నీరు నిలువ ఉండడం వలన దోమలు వ్యాప్తి చెంది మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా లాంటి వ్యాధులు వ్యాపించి రోగాల బారిన పడతారని ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.