12-09-2025 01:30:24 AM
-వారి కుటుంబాలకు అండగా ఉంటాం
-మంత్రి కొండా సురేఖ
-విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అటవీ సిబ్బందికి ఘన నివాళి
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి):వన సంపద పరిరక్షణలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ శాఖ అధికారుల, సిబ్బం ది త్యాగం చిరస్మరణీయమని రాష్ర్ట అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొం డా సురేఖ అన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.
గురువారం నెహ్రూ జూలాజికల్ పార్కులో నిర్వహించిన అటవీ అమరవీరుల సంస్మరణ దినో త్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని, అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘ టించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ డాక్టర్ జితేందర్, పీసీసీ ఎఫ్ సువర్ణ, జిల్లా కలెక్టర్ హరిచందన దాస రి పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 22 మంది అటవీ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, వారి సేవలను ఈ సందర్భంగా స్మరించుకుంటున్నామని తెలిపారు. అటవీ సంపదను కాపాడటంలో అధికారులు నిబద్ధతతో పనిచేస్తు న్నారని మంత్రి ప్రశంసించారు.
అటవీ శాఖ ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అడవుల రక్షణకు ప్రభుత్వ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, అట వీ శాఖ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.